Viral News: సహోద్యోగులు ఎవరూ తన పెళ్లికి రాలేదని.. ఈ నవవధువు ఎంత పని చేసిందో చూడండి!

ABN , First Publish Date - 2022-08-18T02:13:56+05:30 IST

వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వేడుకకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జీవితంలో మొదలు పెట్టబోయే నూతన అధ్యాయనానికి పెళ్లి ద్వారానే నాంది పడుతుంది. అందువల్లే ఈ వివాహ వేడుకను బంధువులు, మిత్రులు, అతిథుల మధ్య అత్యంత ఘనం

Viral News: సహోద్యోగులు ఎవరూ తన పెళ్లికి రాలేదని.. ఈ నవవధువు ఎంత పని చేసిందో చూడండి!

ఇంటర్నెట్ డెస్క్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వేడుకకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జీవితంలో మొదలు పెట్టబోయే నూతన అధ్యాయనానికి పెళ్లి(Marriage) ద్వారానే నాంది పడుతుంది. అందువల్లే ఈ వివాహ వేడుక(Wedding Celebration)ను బంధువులు, మిత్రులు, అతిథుల మధ్య అత్యంత ఘనంగా జరుపుకొని ఆ క్షణాలను.. మధుర జ్ఞాపకంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే కదా మీ సందేహం. ఓ యువతి.. తన పెళ్లికి సహోద్యోగులు(colleagues) హాజరుకాలేదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇంతకూ ఆమె ఎవరు? ఏం నిర్ణయం తీసుకుంది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..





చైనా(China Bride) కు చెందిన ఓ యువతికి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని చూశారు. ఆమెకు అతడు నచ్చడంతో.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారికి పెళ్లి చేయడానికి పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి.. తన పెళ్లి విషయాన్ని తాను పని చేస్తున్న సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేసింది. అంతేకాకుండా.. సహోద్యోగులతో కూడా ఆ విషయాన్ని చెప్పి.. తన ఆనందాన్ని పంచుకుంది. పెళ్లికి తప్పకుండా హాజరుకావాలని కోరింది. దానికి వాళ్లంతా ఓకే కూడా చెప్పారు. తీరా ముహూర్తం సమయానికి యువతి సహోద్యోగులంతా ఆమెకు హ్యాండ్ ఇచ్చారు. 70 మందిలో ఒక్కరంటే ఒక్కరు మాత్రమే.. పెళ్లికి హాజరవడంతో ఆమె మనసు నొచ్చుకుంది. సహోద్యోగులు వస్తారని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం.. చివరికి వాళ్లంతా మాటతప్పడంతో కుటుంబ సభ్యుల ముందు పరువు పోయినట్టుగా ఆ నవవధువు ఫీలైంది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగానికి రాజీనామా(Bride Resigns Job) చేసేసింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలోకి చేరడంతో.. ప్రస్తుతం ఆమె వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.


Updated Date - 2022-08-18T02:13:56+05:30 IST