Panchayat electionsలో గెలిచిన మరునాడే మహిళా సర్పంచ్ మృతి...పోలీసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2022-06-27T12:59:24+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో విజేతగా ప్రకటించిన మరుసటి రోజే మహిళా సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన...

Panchayat electionsలో గెలిచిన మరునాడే మహిళా సర్పంచ్ మృతి...పోలీసుల దర్యాప్తు

భోపాల్ (మధ్యప్రదేశ్): పంచాయతీ ఎన్నికల్లో విజేతగా ప్రకటించిన మరుసటి రోజే మహిళా సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని హర్దా జిల్లాలో వెలుగుచూసింది. మహిళా సర్పంచ్ అభ్యర్థి రుక్మణి బాయి పంచాయతీ ఎన్నికల్లో విజేతగా ప్రకటించిన ఒక రోజు తర్వాత మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.తిమర్ని డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పంటలై గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రుక్మణి బాయి ఎన్నికల్లో తన ప్రత్యర్థి జయంతి బాయిని ఓడించి సర్పంచ్ అయ్యారు.అనంతరం గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా రుక్మణి బాయి 344 ఓట్లతో గెలుపొందారు.సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రిషి గార్గ్ వెంటనే ఎస్‌డిఎం, స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లతో విచారణకు ఆదేశించారు.




గ్రామ ప్రజలందరి సహకారంతో తన తల్లిని సర్పంచ్ పదవికి ప్రతిపాదించినట్లు రుక్మణి బాయి కుమారుడు రాజేష్ తెలిపారు. ఆమె విజయోత్సవాన్ని రాత్రి సంబరాలు చేసుకున్నారు. ‘‘నా తల్లి రాత్రి భోజనం చేసి పడుకుంది, కానీ ఉదయం లేవలేదు’’ అన్నాడు కుమారుడు రాజేష్.


Updated Date - 2022-06-27T12:59:24+05:30 IST