viral video: క్షణాల్లో అప్రమత్తమైన తల్లి.. నాగుపాము నుంచి కుమారుడిని ఎలా రక్షించుకుందో చూడండి!

Published: Sat, 13 Aug 2022 17:13:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
viral video: క్షణాల్లో అప్రమత్తమైన తల్లి.. నాగుపాము నుంచి కుమారుడిని ఎలా రక్షించుకుందో చూడండి!

బెంగళూరు: ఓ తల్లి అప్రమత్తంగా వ్యవహరించి క్షణాల్లోనే స్పందించడంతో ఆమె కుమారుడు ప్రాణాలతో బయపటడ్డాడు. కర్ణాటకలోని మాండ్యా(Mandya)లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం.. స్కూలుకు పంపేందుకు కుమారుడిని రెడీ చేసిన తల్లి అతడితో కలిసి ఇంటి బయటకు వచ్చింది. బాలుడు కిందికి వెళ్లేందుకు మెట్లు దిగాడు. అప్పటికే ఓ పెద్ద నాగుపాము (cobra) మెట్ల పక్క నుంచి పాక్కుంటూ వెళ్తోంది. ఈ విషయాన్ని గుర్తించి చిన్నారి కింద కాలు దానికి తాకడంతో అది వెంటనే తన తలను వెనక్కి తీసుకుంది. 


ఆ తర్వాత ఎందుకు వెనక్కి తిరిగి చూసిన కుర్రాడిని కాటువేసేందుకు నాగుపాము పడగ ఎత్తింది. దీంతో బాలుడు భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అది చూసిన తల్లి గబుక్కున కిందికి దూకి కుమారుడిని అమాంతం ఎత్తుకుని దూరం జరిగింది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో చూసిన వారు హడలిపోతున్నారు. కుమారుడిని అందుకోవడంలో ఆ తల్లి ఒక్క క్షణం ఆలస్యం చేసిన పెను ప్రమాదం జరిగి ఉండేదని కామెంట్ చేశారు. కుమారుడిని తల్లి గట్టిగా పట్టుకుని వెనక్కి రావడంతో పాము అక్కడి నుంచి నిదానంగా వెళ్లిపోయింది. క్షణాల్లోనే స్పందించిన బాలుడి తల్లిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.