మీకు Smart Phone, Laptop ఉందా.. అయితే దాని గురించి మీరిక మర్చిపోండి!

ABN , First Publish Date - 2022-06-05T22:50:16+05:30 IST

సాంకేతిక రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు.. తమ ప్రైవసీకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. తమకు సంబంధించిన ఏ విషయం కూడా అపరిచితుల చేతుల్లోకి వెళ్లకుండా ఎన్నో జాగ్రత్త

మీకు Smart Phone, Laptop ఉందా.. అయితే దాని గురించి మీరిక మర్చిపోండి!

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు.. తమ ప్రైవసీకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. తమకు సంబంధించిన ఏ విషయం కూడా అపరిచితుల చేతుల్లోకి వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన దేశ ప్రజలు కూడా ప్రైవసీ ఇంపార్టెన్స్‌ను గుర్తించి.. పగడ్బంధీగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇండియాలో గోప్యంగా ఉంటుందా అంటే.. ఖచ్చితంగా చెప్పలేం. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన డేటా ఇండియాలో డేటా ప్రైవసీ‌పై అనే సందేహాలను లేవనెత్తుతోంది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఓ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సాధారణంగా ఎవ్వరైనా సరే.. తాము ఫ్లోన్లో ఎవరితో మాట్లాడమనే విషయాన్ని గోప్యంగా ఉంచుకుంటారు. సొంత కుటుంబ సభ్యులతో కూడా కొన్ని కొన్ని సార్లు ఆ విషయాన్ని పంచుకోరు. అటువంటి ఫోన్ నెంబర్ల లిస్ట్.. అపరిచితుల చేతికి చిక్కితే, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు మన ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని ఫోన్లలో రకరకాల సెక్యూరిటీ ఫీచర్లతో భద్రపరుచుకుంటూ ఉంటారు. మరి ఇంత చేసినా.. మరి ఇంత చేసినా మన సమాచారం గోప్యంగా ఉంటుందా అంటే లేదు. ఈ విషయం ఓ మహిళ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా బహిర్గతం అయింది. Prerna Lidhoo యూజర్ నేమ్‌తో ట్విట్టర్‌లో ఖాతా కలిగిన ఓ మహిళ.. తాజాగా భేల్‌పూరీ తినడానికి ఓ షాప్‌కు వెళ్లింది. 



అక్కడి వ్యాపారి.. భేల్‌పూరీని ఓ పేపర్‌లో పెట్టి, ఆమెకు సర్వ్‌చేశాడు. వ్యాపారి తన చేతికి ఇచ్చిన కాగితంలో.. సందీప్ రాణే అనే గుర్తు తెలియని వ్యక్తి కాల్ హిస్టరీ సమాచారం ఉండటంతో ఆమె అవాక్కైంది. వెంటనే ఆ కాగితాన్ని ఫొటో తీసిన ఆమె.. అందులో ఉన్న నెంబర్లను బ్లర్ చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతోపాటు.. ఇండియాలో డేటా ప్రైవసీ లేనే లేదని.. ఉందని ఎవరైనా అంటే అది పెద్ద జోక్ అవుతుందంటూ రాసుకొచ్చారు. ఆమె ట్వీట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ కావడంతో.. డేటా ప్రైవసీ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ‘మీకు కెమెరాతో కూడిన ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ ఉందా. అందులో యాప్‌లను కూడా ఉపయోగిస్తున్నారా? దీనికి తోడు సోషల్ మీడియాలో అకౌంట్ కూడా ఉందా.. అయితే మీ డేటా ప్రైవసీ గురించి మీరు మర్చిపోండి’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. 


Updated Date - 2022-06-05T22:50:16+05:30 IST