కళ్ల ముందే లక్షలు విలువ చేసే మందు బాటిళ్లు ధ్వంసం.. యూకేలో..

ABN , First Publish Date - 2020-11-28T18:14:21+05:30 IST

లక్షలు విలువ చేసే మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కళ్ల ముందే లక్షలు విలువ చేసే మందు బాటిళ్లు ధ్వంసం.. యూకేలో..

హెర్ట్‌ఫోర్డ్‌షైర్: లక్షలు విలువ చేసే మద్యం సీసాలను ధ్వంసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని ఆల్డి స్టోర్‌కు బుధవారం మధ్యాహ్నం ఓ మహిళ వెళ్లింది. మద్యం సీసాలున్న ప్రదేశానికి వెళ్లి అక్కడున్న మద్యం బాటిళ్లను నేలకేసి కొట్టడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. దగ్గరికి వెళ్తే మద్యం బాటిళ్లతో కొడుతుందేమోనని స్టోర్ సిబ్బంది సైతం ఆమె దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. స్టోర్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేతికి గాయాలు కావడంతో మొదట ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. 


మహిళ మానసిక పరిస్థితి బాగోకపోవడంతోనే ఈ విధంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను చూసి నెటిజన్లు కంగుతింటున్నారు. పైనున్న ఫొటోను గమనిస్తే స్టోర్‌లో మహిళ ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. మహిళ అసలు అన్ని మద్యం బాటిళ్లను పగులగొడుతుంటే సిబ్బంది ఏం చేస్తోందంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది ఎదుటే ఇన్ని మద్యం బాటిళ్లను మహిళ ధ్వంసం చేసిందంటే నమ్మలేకపోతున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. 

Updated Date - 2020-11-28T18:14:21+05:30 IST