ప్రియురాలిపై అత్యాచారం చేసి జైలుకెళ్లిన యువకుడు.. అతడిని మళ్లీ కలిసేందుకు ఆమె ఎలాంటి స్కెచ్ వేసిందంటే..

ABN , First Publish Date - 2022-07-16T00:43:49+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లపాటు కలిసి తిరిగారు. ఒకరోజు ఆ యువకుడు తన ప్రేయసిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

ప్రియురాలిపై అత్యాచారం చేసి జైలుకెళ్లిన యువకుడు.. అతడిని మళ్లీ కలిసేందుకు ఆమె ఎలాంటి స్కెచ్ వేసిందంటే..

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లపాటు కలిసి తిరిగారు. ఒకరోజు ఆ యువకుడు తన ప్రేయసిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఆ యువతి ఇంట్లో వారికి తెలిసింది. దీంతో వారు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. తాజాగా, అతను జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పట్నుంచి అతడిని కలవాలని ఆ యువతి ప్రయత్నించింది. అయితే అతను మాత్రం ఆమెను కలిసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె ఓ స్కెచ్ వేసి పోలీసులకు దొరికిపోయింది.


ఇది కూడా చదవండి..

Wedding Contract: జిమ్‌లో వర్కవుట్స్ నుంచి రోజూ చీర కట్టుకోవడం వరకు.. నెట్టింట హాట్‌టాపిక్‌గా మారిన ‘పెళ్లి నిబంధనలు’..


Mumbaiకు చెందిన ఓ యువకుడు తన ప్రేయసిపై అత్యాచారానికి పాల్పడి జైలు పాలయ్యాడు. చాలా నెల జైలు వాసం తర్వాత అతడికి బెయిల్ లభించింది. ఇటీవలె అతను బయటకు వచ్చి తన జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో ఆ యువతి తన మాజీ ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను కలిసేందుకు ఆ యువకుడు ఇష్టపడలేదు. దీంతో ఆ యువతి తన మాజీ ప్రియుడిని దారిలోకి తెచ్చేందుకు ఓ స్కెచ్ వేసింది. అతని బైక్ దొంగిలించాలని ప్లాన్ వేసింది. దీని కోసం మరో యువకుడి సహాయం తీసుకుంది. నకిలీ తాళం చేయించింది. 


ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ప్రియుడి బైక్ బయట పార్క్ చేసి ఉండగా.. మరో యువకుడి చేత బైక్ దొంగతనం చేయించింది. ఉదయాన్నే ఆ యువకుడు లేచి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ లోపు ఆ యువతి తన మాజీ ప్రియుడికి స్నేహితుడి మొబైల్ నుంచి మెసేజ్ పంపించింది. తనతో ఒకసారి మాట్లాడితే బైక్ ఎక్కడ ఉందో చెబుతానని చెప్పింది. దీంతో ఆమెపై అనుమానం ఉన్నట్టు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆ యువతిని అదుపులోనికి తీసుకుని విచారించగా  తానే బైక్ చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. దీంతో పోలీసులు యువతిని అరెస్టు చేశారు. 



Updated Date - 2022-07-16T00:43:49+05:30 IST