పార్టీకి ఆహ్వానించలేదని సహోద్యోగులపై కేసు పెట్టిన మహిళ.. ఆమెకు రూ.72 లక్షలు నష్టపరిహారం కట్టాలని తీర్పునిచ్చిన కోర్టు!

ABN , First Publish Date - 2022-05-22T06:17:45+05:30 IST

ఒక కాసినో(జూదం ఆడే క్లబ్)లో పనిచేసే ఒక మహిళ తనతో పాటు పనిచేసే ఉద్యోగులకు వ్యతిరేకంగా కేసు పెట్టింది. వారంతా కలిసి కంపెనీ తరపున పార్టీ చేసుకున్నారని తనను బహిష్కరించారని కేసులో పేర్కొంది. ఆ వాదనలను విన్న కోర్టు ఆ మహిళకు జరిగిన అన్యాయానికి బదులుగా సుమారు రూ.72 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ...

పార్టీకి ఆహ్వానించలేదని సహోద్యోగులపై కేసు పెట్టిన మహిళ.. ఆమెకు రూ.72 లక్షలు నష్టపరిహారం కట్టాలని తీర్పునిచ్చిన కోర్టు!

ఒక కాసినో(జూదం ఆడే క్లబ్)లో పనిచేసే ఒక మహిళ తనతో పాటు పనిచేసే ఉద్యోగులకు వ్యతిరేకంగా కేసు పెట్టింది. వారంతా కలిసి కంపెనీ తరపున పార్టీ చేసుకున్నారని కానీ తనను  మాత్రం బహిష్కరించారని కేసులో పేర్కొంది. ఆ వాదనలను విన్న కోర్టు ఆ మహిళకు జరిగిన అన్యాయానికి బదులుగా సుమారు రూ.72 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ యజమాన్యం, ఉద్యోగులకు ఆదేశించింది. ఈ ఘటన లండన్లో జరిగింది.


లండన్ లోని స్ట్రాట్ పోర్డ్ ప్రాంతంలో ఉన్న యాస్పర్స్ కాసినోలో లెహెర్ రీటా(51) అనే మహళ 2011 నుంచి ఒక క్యాషియర్ గా ఉద్యోగం చేస్తోంది. లెహెర్ రీటా ఒక నల్ల జాతీయురాలు. ఆమె రంగు కారణంగా కాసినోలో తనతో పాటు పనిచేసే ఉద్యోగులు ఆమెతో ఫ్రెండ్లీగా ఉండేవారు కాదు. అంతేకాదు రీటా రంగు కారణంగా ఆమెకు కంపెనీలో ఉన్నత ఉద్యోగం కోసం ప్రమోషన్ కూడా లభించలేదు. ఆమె కంటే జూనియర్ అయిన వాళ్లందరికీ ప్రమోషన్ లభించింది. సహోద్యోగులు ఆమెతో దురుసుగా ప్రవర్తించేవారు. 


ఈ కారణంగా రీటా డిప్రెషన్ కు గురైంది. ఒకరోజు కంపెనీ తరపున ఉద్యోగులంతా కలిసి అవుటింగ్ పార్టీకి వెళ్లారు. కానీ ఆ పార్టీకి రీటాను ఆహ్వానించలేదు. పైగా పార్టీ నుంచి వచ్చాక అక్కడ తామంతా బాగా ఎంజాయ్ చేశామని రీటీ ముందు చెప్పుకునేవారు. దీంతో మనస్తాపానికి గురైన రీటా 2018లో తన సహోద్యోగులతో పాటు కంపెనీ యజమాన్యంపై కేసు వేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వివరించింది. తనను మానసికంగా వేధించారని కేసు విచారణ సమయంలో చెప్పింది. 


రీటా వాదనలు విన్న కోర్టు ఆమెకు జరిగిన అన్యాయానికి బదులుగా కంపెనీ యజమాన్యం, మిగతా ఉద్యోగులకు 74,113 పౌండ్లు(బ్రిటన్ దేశ కరెన్సీ .. సుమారు రూ.72 లక్షలకు పైగా) జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలు రీటాకు చెల్లించాలని తీర్పు నిచ్చింది. లెహెర్ రీటా 2018లోనే కాసినో ఉద్యోగానికి రాజీనామా చేసింది.

Updated Date - 2022-05-22T06:17:45+05:30 IST