తాత కళ్లల్లో ఆనందం చూడాలని మనమరాలు చేసిందో ప్రయత్నం.. అబ్బురపడుతున్న నెటజన్లు!

ABN , First Publish Date - 2021-10-31T03:06:21+05:30 IST

చిన్నతనం అంటే ముందుగా గుర్తొచ్చేది తాతలు అమ్మమ్మలు కురిపించిన ఆప్యాయతే..! వారు లేకుండా చిన్నతనం గురించి చెప్పుకోవడం అసంభవం. కానీ..

తాత కళ్లల్లో ఆనందం చూడాలని మనమరాలు చేసిందో ప్రయత్నం.. అబ్బురపడుతున్న నెటజన్లు!

ఇంటర్నటె డెస్క్: చిన్నతనం అంటే ముందుగా గుర్తొచ్చేది  తాతలు అమ్మమ్మలు కురిపించిన ఆప్యాయతే..! వారు లేకుండా చిన్నతనం గురించి చెప్పుకోవడం అసంభవం. కానీ.. మనం పెద్దయ్యే కొద్దీ వారు జీవిత చరమాకానికి చేరుకుంటారు. కొందరిలో ఆల్జైమర్స్ వంటి వ్యాధుల కారణంగా తమ మనమలు, మనమరాళ్లను గుర్తుపట్టే స్థితిలో కూడా ఉండరు. అయితే..సరిగ్గా ఇటువంటి పరిస్థితినే షీలా అనే యువతి ఎదుర్కొంది. అయితే.. తన తాతయ్య కళ్లలో ఆనందం చూసేందుకు, ఆయనను సర్‌ప్రైజ్ చేసేందుకు ఆమె ఓ చిన్న ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ నెటిజన్లను తెగ మురిపిస్తోంది. 


ఆ యువతి తాతయ్య ఆమెను గుర్తు పట్టే స్థితిలో లేరు. అయితే..ఆయనకు పియానో వాయించే అలవాటు ఉంది. ఇప్పటికీ ఆయన సంగీతాన్ని ఆస్వాదించే స్థితిలో ఉన్నారు. దీంతో.. ఆ యువతి ఓ రోజు ఆయన ఇంట్లో పియానో వాయించడం మొదలెట్టింది. ఆ మ్యూజిక్ చెవిన పడగానే పెద్దాయనలో ఏదో కుతూహలం. మరో గదిలో ఉన్న ఆయన..పియానో ఉన్న గదిలోకి వచ్చారు. అక్కడ ఓ యువతి కనిపించింది. ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోయినా కూడా సంగీతం మాత్రం నచ్చింది. కాసేపు సంశయంగా అటూ ఇటూ చూసి.. ఆ తరువాత.. ఆమె పక్కన నిలబడి సంగీతాన్ని విన్నారు. చివరికి బాగుందంటూతో చేతితో సైగ చేశారు. ఇక నిలబడలేక..పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని అలాగే చిన్న కునుకులోకి జారుకున్నారు. ఇదంతా ఆ వీడియోలో రికార్డయ్యాయి. దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేసిన షీలా.. ‘మనవాళ్లతో గడిపేందుకు మనకున్న సమయం చాలా తక్కువ..ప్రతిక్షణాన్ని ఒడిసిపట్టుకోండి..’అంటూ ఓ సందేశం ఇస్తుంది. ఈ వీడియో,  ఆమె ఇచ్చిన సందేశం ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో యమాగా వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-10-31T03:06:21+05:30 IST