కాబోయే భర్తకు స్నేహితురాలితో కలిసి పరీక్ష పెట్టిన యువతి.. చివరకు భర్త చేసిన పనేంటో తెలుసుకుని ఖంగుతింది..

Published: Thu, 24 Feb 2022 21:43:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాబోయే భర్తకు స్నేహితురాలితో కలిసి పరీక్ష పెట్టిన యువతి.. చివరకు భర్త చేసిన పనేంటో తెలుసుకుని ఖంగుతింది..ప్రతీకాత్మక చిత్రం

వివాహం నిశ్చయం అయిన సందర్భాల్లో యువతులకు ఏవోవే ఆలోచనలు మదిని తొలుస్తూ ఉంటాయి. కొన్ని సంతోషాన్ని కలిగిస్తే.. మరికొన్ని సందేహాలను కలిగిస్తుంటాయి. పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితం ఎలా వుండాలనే విషయంలోనూ ఒకటికి పదిసార్లు ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అలాగే కాబోయే భర్త ఎలాంటి వాడో తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంటుంది. ఇలా మనసులో దాగి ఉన్న ఎన్నెన్నో సందేహాలను నివృత్తి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకోసం రకరకాల ఐడియాలు వేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని సత్ఫలితాలు ఇస్తే.. మరికొన్ని బెడిసికొడుతూ ఉంటాయి. ఓ యువతి తనకు కాబోయే భర్తకు ఓ పరీక్ష పెట్టింది. ఇందుకోసం తన స్నేహితురాలితో కలిసి ఓ ప్లాన్ వేసింది. చివరకు ఏమైందంటే.. 

ఓ బ్రెజిలియన్ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈమెకు అందరి అమ్మాయిల్లాగే ఎన్నో సందేహాలు ఉండేవి. తనకు కాబోయే భర్తకు ఎలాంటి అక్రమ సంబంధాలు ఉండవని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలు లిడియాకు కూడా చెప్పింది. తనను తప్ప వేరే యువతిని కన్నెత్తి కూడా చూడడని చెప్పింది. కావాలంటే నువ్వే టెస్ట్ చేయ్ అంటూ రూ.6000కు పందెం కాసింది. పందెం ప్రకారం ఇన్‌స్టాగ్రాంలో తనకు కాబోయే భర్తకు మెసేజ్ చేసి పరిచయం చేసుకోవాలని సూచించింది. ఆమె చెప్పినట్లుగానే యువకుడికి లిడియా మెసేజ్ చేసింది. ఈమె ఫొటో చూడగానే ఆ వ్యక్తి వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘‘నాకు పెళ్లి కాలేదు.. అలాగే ఎవరితోనూ సంబంధాలు లేవు.. నీకు ఇష్టమైతే డేటింగ్‌కు సిద్ధం’’ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో  లిడియా ఒక్కసారిగా అవాక్కయింది. మెసేజ్‌లను ఫొటో తీసి తన స్నేహితురాలకి పంపింది. అంతవరకు తన భర్త.. ఎంతో మంచివాడనే భ్రమలో ఉన్న ఆమె.. ఈ మెసేజ్‌లు చూడగానే ఖంగుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి.. రూ.22 కోట్ల విలువైన కార్లను చోరీ చేసి.. పోలీసులకే ఓ దొంగ సవాల్భర్త దూరమైనా కుంగిపోలేదు.. నలుగురు కుమార్తెలను పోషించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం.. అంతా శభాష్ అనేలా ఉంది..videoViral Video: పెంపుడు కుక్కపై ఈ మహిళ ప్రేమ చూడండి.. బేటా, అంటూ కౌగిలించుకుని ఎంత బాగా చూసుకుంటుందో.. videoట్యూషన్‌కు వచ్చిన బాలికను టార్గెట్ చేసిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో ఇలా చేస్తాడని ఊహించలేదు.. పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..Viral Video: అంబులెన్స్‌ వెనుకే కిలోమీటర్ల మేర పరుగులు పెట్టిన గుర్రం.. కారణం ఏంటో తెలుసా..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.