‘నీకు పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లిచేసుకుంటా..’ అని భర్త అనడంతో..

ABN , First Publish Date - 2020-10-29T15:34:57+05:30 IST

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలతండాకు చెందిన దనావత్‌ మౌనిక(20)కు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకు చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది.

‘నీకు పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లిచేసుకుంటా..’ అని భర్త అనడంతో..

భర్త వేధింపులు తాళలేక...


విజయపురిసౌత్‌ (గుంటూరు): భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాచర్ల మండలం చింతలతండా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలతండాకు చెందిన దనావత్‌ మౌనిక(20)కు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకు చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అశోక్‌ అనుమానంతో భార్యను వేధిస్తూ ఉండేవాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరగడం తిరిగి కాపురం పంపడం జరుగుతూ వస్తోంది. ఈ నెల 21న ఇతరుల ఫోన్‌తో మౌనిక తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త చేయి చేసుకోవడంతో మౌనిక పుట్టింటికి చేరింది. 


ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండడంతో దసరా పండుగకు అశోక్‌ కుటుంబ సభ్యులు చింతలతండాకు వచ్చి వెళ్లారు. ‘నీకు పిల్లలు పుట్టడం లేదు.. నేను వేరే పెళ్లిచేసుకుంటా..’ అని అశోక్‌ తన భార్యతో పలుసార్లు అనడంతో మనస్థాపం చెందిన మౌనిక ఇంట్లో ఉన్న గడ్డిమందును ఈనెల 26న తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరుసటి రోజు గుంటూరుకు తరలిస్తుండడంతో మార్గమధ్యంలో మౌనిక మరణించింది. మృతదేహాన్ని స్వగ్రామమైన చింతలతండాకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం మౌనిక మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-29T15:34:57+05:30 IST