కొరియన్ మహిళ తన కొడుకు చేత పకోడీలు తినిపిస్తూ హిందీ నేర్పుతోంది... వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-07-20T17:16:01+05:30 IST

కులాంతర, మతాంతర, ప్రాంతీయాంతర...

కొరియన్ మహిళ తన కొడుకు చేత పకోడీలు తినిపిస్తూ హిందీ నేర్పుతోంది... వీడియో వైరల్!

కులాంతర, మతాంతర, ప్రాంతీయాంతర తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఇంట్లో వివిధ భాషలను నేర్చుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో ఒక కొరియన్ మహిళ తన కొడుకుకు హిందీ నేర్పుతున్నట్లు కనిపిస్తోంది. ఆ మహిళ భారతీయుడిని పెళ్లాడింది. ఆ మహిళ తన కొడుకుకు పకోడీలు తినిపిస్తూ హిందీ బోధిస్తూ కనిపిస్తోంది. ఈ వీడియో చూపరులకు ఎంతో ముచ్చట గొలుపుతోంది. ఈ వీడియోను జూలై 5న premkimforever ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 3.60 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 


"కొరియన్ భార్య తన కుమారునికి హిందీ నేర్పిస్తోంది" అనే టెక్ట్స్ వీడియోలో కనిపిస్తోంది. కిమ్ అనే ఈ మహిళ తన కుమారునికి "పకోడీ" గురించి బోధించడం కనిపిస్తుంది. ఆమె తన కుమారునితో "పకోడీ స్వాద్ హై"(పకోడీ రుచికరంగా ఉంది) అని పలకాలని కుమారునికి చెబుతోంది. దీనిని విన్న ఆమె కుమారుడు అలాగే పలుకుతాడు. ఈ వీడియోకు 20 వేలకు మించిన లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘భారతీయ చిన్నారులు పకోడీలను కారు లేదా జంతువు ఆకారంలో ఉందని చెబుతూ, ఆహారాన్ని ఆడుకుంటూ తింటారు’ అని వ్యాఖ్యానించారు.  “మీరు మీ పిల్లవానికి హిందీ బోధించడంచాలా ఆనందంగా ఉందని మరొక యూజర్ పేర్కొన్నాడు.‘ ఈ ప్రపంచంలోని ప్రతి భాష అందంగా ఉంటుంది. ప్రతి భాషను గౌరవిద్దాం’’ అని మరో యూజర్ అన్నారు. 11 వేల మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఇతర వీడియోలలో ఈ మహిళ పకోడీలులు, రోటీలు, మోమోలను తయారు చేస్తూ కనిపిస్తోంది. 

Updated Date - 2022-07-20T17:16:01+05:30 IST