in laws దారుణం...కోడలిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు

ABN , First Publish Date - 2022-05-02T13:20:36+05:30 IST

బీహార్ రాష్ట్రంలో తాజాగా దారుణం వెలుగుచూసింది....

in laws దారుణం...కోడలిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు

పాట్నా (బీహార్): బీహార్ రాష్ట్రంలో తాజాగా దారుణం వెలుగుచూసింది. కోడలు గ్రామంలోని మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో అత్తమామలే ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన రోహతాస్ జిల్లాలో సంచలనం రేపింది.అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే ఓ మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారని రోహతాస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భారతి చెప్పారు. ఈ కేసులో బాధితురాలి భర్త, అత్తమామలు, బంధువులు ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు.పోలీసు అధికారులు జంటను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.


Updated Date - 2022-05-02T13:20:36+05:30 IST