rakhi: రక్షాబంధన్ సందర్భంగా నెటిజన్లను కంటతడి పెట్టించిన సోదరి

ABN , First Publish Date - 2022-08-12T13:45:01+05:30 IST

రక్షాబంధన్ సందర్భంగా నెటిజన్లను కంటతడి పెట్టించిన సోదరి ఉదంతం వెలుగుచూసింది....

rakhi: రక్షాబంధన్ సందర్భంగా నెటిజన్లను కంటతడి పెట్టించిన సోదరి

అమరజవాన్ అయిన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి

జైపూర్ (రాజస్థాన్):రక్షాబంధన్ సందర్భంగా నెటిజన్లను కంటతడి పెట్టించిన సోదరి ఉదంతం వెలుగుచూసింది. రాఖీ పండుగ సందర్భంగా అమరవీరుడైన తన సోదరుడి విగ్రహానికి సోదరి రాఖీ కట్టిన చిత్రం(Woman ties rakhi on martyred brothers statue) నెటిజన్లను కంటతడి పెట్టించింది.(netizens teary eyed)రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గణపత్ రాం కద్వాస్ అనే యువ సైనికుడు జమ్మూకశ్మీరులో శత్రువులతో పోరాడుతూ 2017 సెప్టెంబరు 24వతేదీన వీరమరణం( martyred brother) చెందారు. అనంతరం షహీద్ గణపత్ రాం కద్వాస్ వీరమరణం అనంతరం అతని విగ్రహాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. 


రక్షాబంధన్ పండుగ సందర్భంగా జోధ్‌పూర్ నగర సమీపంలో ఖుడియాలా గ్రామానికి చెందిన వీరుడి సోదరి గణపత్ రాం కద్వాస్ విగ్రహం వద్దకు శుక్రవారం వచ్చి అతని విగ్రహం చేతికి రాఖీ కట్టి అతని ఆశీస్సులు పొందారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయి వీరుడిగా మిగిలిన తన సోదరుడిని రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అతని విగ్రహం చేతికి రాఖీ( rakhi) కట్టిన సోదరి(sister) చిత్రాన్ని వేదాంత బిర్లా లింకెడిన్ లో(LinkedIn by Vedant Birla) పోస్టు చేశారు. ఈ చిత్రం నెటిజన్లను కంటతడి పెట్టించింది. 


దేశం కోసం త్యాగం చేసిన సోదరుడిని కోల్పోయినందుకు దుఃఖంతో ఉన్న సోదరి రక్షా బంధన్ రోజున భావోద్వేగంతో తన సోదరుడి విగ్రహం మణికట్టుకు రాఖీ కట్టింది.సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుకు వేలాది స్పందనలు, కామెంట్లు వచ్చాయి. ఈ పోస్టు నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది. 


Updated Date - 2022-08-12T13:45:01+05:30 IST