మహిళ మ్యాజిక్.. కోట్ల రూపాయల ధర పలుకుతున్న భవంతి..!

ABN , First Publish Date - 2021-06-18T01:02:58+05:30 IST

అది బ్రిటన్‌లోని వేల్స్‌లోగల ఓ సముద్రపు తీరం. బీచ్‌లోని అందాలను తిలకించేందుకు పర్యటకులు నిత్యం క్యూకడుతుంటారు. కానీ ఆ బీచ్‌లో ఉన్న ఓ షాపు వైపు చూస్తే మాత్రం..

మహిళ మ్యాజిక్.. కోట్ల రూపాయల ధర పలుకుతున్న భవంతి..!

ఇంటర్నెట్ డెస్క్: అది బ్రిటన్‌లోని వేల్స్‌లోగల ఓ సముద్రపు తీరం. బీచ్‌లోని అందాలను తిలకించేందుకు పర్యటకులు నిత్యం క్యూకడుతుంటారు. కానీ ఆ బీచ్‌లో ఉన్న ఓ షాపు వైపు చూస్తే మాత్రం సంతోషం స్థానంలో చిరాకు పుడుతుంది. పాత కాలం నాటి షాపు పెచ్చులూడిపోయి అందవిహీనంగా మారిపోయింది. ప్రకృతి అందాలు..కొత్తగా వెలసిన ఆధునిక కట్టడాల నడుపు ఓ మచ్చలా మిగిలిపోయింది. దీంతో ఆ షాపును కొనేవారు గానీ..పునరుద్ధరించేవారు కరువైపోయారు. 


కానీ.. ఓ రోజు షాపును చూసిన ఎలిజబెత్‌కు మనసులో సరికొత్త ఆలోచన మెదిలింది. అంతే.. కొన్ని రోజుల కష్టం తరువాత అక్కడ ఓ అందమైన భవంతి రూపుదిద్దుకుంది. దాని విలువ ప్రస్తుతం ఐదు కోట్ల రూపాయలకు పైమాటే. దీన్ని చేజిక్కించుకునేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు.  ఇంతకీ ఏం చేసిందంటరా.. ముందుగా ఆ స్థలాన్ని కొనుక్కుని దాని వ్యక్తిగత అవసరాలను వినియోగించేందుకు స్థానిక కౌన్సిల్ నుంచి అనుమతి పొందింది. ఆ తరువాత షాపును కూల్చేసి దాని స్థానంలో ఓ అందమైన ఇంటిని నిర్మించింది. తీర ప్రాంతపు అనుభూతులను మరింత పెంచేలా ఎలిజబెత్ ఈ ఇంటిని డిజైన్ చేయించారు. కేవలం ఆరు వారాల వ్యవధిలో అక్కడ పాడుబడిన షాపు స్థానంలో ఓ అందమైన పొదరిల్లు ఏర్పాటైంది. మూడు బెడ్రూంలు, ఒపెన్‌ కిచెన్‌, లాంజ్‌, గార్డెన్‌లతో అందమైన ఇంటిని సృష్టించారు. ఇప్పుడు దాని ధర ఏకంగా రూ. 5.16 కోట్లకు చేరుకుంది. అంతకన్నా ఎక్కువ ధర పలికినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు ఎలిజెబెత్. 

Updated Date - 2021-06-18T01:02:58+05:30 IST