భార్యాభర్తల వైరల్ వీడియో...! ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్!

ABN , First Publish Date - 2021-02-20T22:00:18+05:30 IST

ముద్దిస్తానన్న భార్య.. వద్దు వద్దంటూ ముడుచుకుపోయిన భర్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టైటిల్ ఇది! భార్య ప్రేమగా ముద్దివ్వబోతే..ఆయనేమో వద్దూ అందరూ చూస్తున్నారు..తప్పుకాదు అంటూ చిన్నగా విసుక్కుంటాడు. ఓ జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించిన దృశ్యం ఇది. కరోనా కాలం తెచ్చిన కొత్త అనుభవం జూమ్ మీటింగ్స్‌తో ఇటువంటి వైరల్ వీడియోలు చాలా కామన్ అయిపోయాయి. అయితే..

భార్యాభర్తల వైరల్ వీడియో...! ఆనంద్ మహీంద్రా ఫన్నీ కామెంట్!

ఇంటర్నెట్ డెస్క్: ముద్దిస్తానన్న భార్య..  వద్దు వద్దంటూ ముడుచుకుపోయిన భర్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టైటిల్ ఇది! భార్య ప్రేమగా ముద్దివ్వబోతే..ఆయనేమో వద్దూ అందరూ చూస్తున్నారు..తప్పుకాదు అంటూ చిన్నగా విసుక్కుంటాడు. ఓ జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించిన దృశ్యం ఇది. కరోనా కాలం తెచ్చిన కొత్త అనుభవం జూమ్ మీటింగ్స్‌తో ఇటువంటి ఫన్నీ వీడియోలు చాలా కామన్ అయిపోయాయి.  అయితే.. ఈ వీడియోలోని జంట నడివయస్సుకు చేరుకున్నారు.


బహుశా అందుకేనేమో ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతోంది.  యుక్తవయసు ఉద్రేకాల స్థాయిని దాటి..బంధం మరింతగా బలపడి సాన్నిహిత్యం పెరిగిన దశలో వారి మధ్య చోటుచేసుకున్న ఫన్నీ రొమాన్స్ ఇది! ఆ భార్యాభర్తల ఈక్వేషన్‌ చూసి తెగ ముచ్చపడుతున్న నెటిజన్లు వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే..ఈ వీడియో చూసిన వారిలో అనేక మంది భర్త రియాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భార్య ప్రేమతో ముద్దివ్వబోతుంటే..ఇదేం రెస్పాన్స్.. అంటు కాస్తంత చిలిప కొపం ప్రదర్శిస్తున్నారు.


ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియోపై కామెంట్ చేశారు. అతడిపై భార్య చూపిస్తున్న అనురాగానికి ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా.. ఈ ఏడాది ఉత్తమ భార్యగా ఈమేనే నేను నామినేట్ చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు. ‘భర్త మరింత పాజిటివ్‌గా స్పందించి ఉంటే..ఈ ఏడాది ఉత్తమ జంటగా వీరినే నామినేట్ చేసి ఉండేవాడినని..అయితే..అనవసర చిరాకు ప్రదర్శించి ఆ భర్త ఛాన్స్ కోల్పోయారు’ అంటూ కామెంట్ చేశారు! అధిక శాతం మంది ఈ జంటను చూసి ముచ్చటపడుతుంటే.. కొందరూ మాత్రం వ్యక్తిగత జీవితం ఇలా రచ్చకెక్కడం సబబు కాదేమో అని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారూ..?



Read more