మీ అబ్బాయి నాకు కావాలి.. రూ. 3.7 కోట్లకు అమ్మేస్తావా..! సూపర్ మార్కెట్లో షాకింగ్ బేరం

ABN , First Publish Date - 2022-01-25T03:08:25+05:30 IST

సూపర్ మార్కెట్లో షాపింగ్ కోసం వచ్చిన మహిళతో ఆమె బిడ్డను కొనుగోలు చేసేందుకు మరో మహిళ బేరం చేసిన ఘటన టెక్సాస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

మీ అబ్బాయి నాకు కావాలి..  రూ. 3.7 కోట్లకు అమ్మేస్తావా..! సూపర్ మార్కెట్లో షాకింగ్ బేరం

ఇంటర్నెట్ డెస్క్: సూపర్ మార్కెట్లో షాపింగ్ కోసం వచ్చిన మహిళతో ఆమె బిడ్డను కొనుగోలు చేసేందుకు మరో మహిళ బేరం చేసిన ఘటన టెక్సాస్ రాష్ట్రంలో వెలుగు చూసింది. హ్యూస్టన్ కౌంటీలో గతవారం ఈ ఘటన జరిగింది. ప్రముఖ సూపర్ మార్కెట్ చెయిన్ వాల్‌మార్ట్‌లో క్యూలో తన బిడ్డ ఎత్తుకుని నిలబడిన మహిళతో నిందితురాలు రెబెకా బెన్నెట్ ఇలాంటి అసాధారణ ప్రతిపాదన చేసింది. ‘‘నీ బిడ్డ జుత్తు, నీలి కళ్లు బాగున్నాయి. 5 లక్షల డాలర్లకు(రూ. 3.7 కోట్లు) ఇస్తావా’’ అని రెబెకా అనడంతో బాధితురాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. మొదట రెబెకా జోక్ చేస్తోందని ఆమె భావించినప్పటికీ.. బిడ్డ కోసం ఆమె పట్టుబట్టిన తీరు చూసి భయపడిపోయింది. ఆమె వెళ్లిపోయేంతవరకూ బాధితురాలు తన కారులో కూర్చుని తలుపులను లాక్ చేసుకుంది. రెబెకా తన దారిన తాను వెళ్లిపోయాక.. బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చింది. పోలీసుల ఇటీవలే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-01-25T03:08:25+05:30 IST