సారూ.. 35 ఏళ్ల క్రితం నన్ను చంపేశారు.. ఇప్పుడు నా ఆధార్, పాన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు చూసయినా బతికించండి సారూ.. ఓ మహిళ కన్నీటి గాథ!

ABN , First Publish Date - 2021-10-29T17:14:14+05:30 IST

బీహార్‌లోని బెతియాలో వింత ఘటన చోటుచేసుకుంది.

సారూ.. 35 ఏళ్ల క్రితం నన్ను చంపేశారు.. ఇప్పుడు నా ఆధార్, పాన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు చూసయినా బతికించండి సారూ.. ఓ మహిళ కన్నీటి గాథ!

బీహార్‌లోని బెతియాలో వింత ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల క్రితం మాయమైన ఒక మహిళ తిరిగి ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె చనిపోయిందని సర్టిఫికెట్ ద్వారా నిర్థారణ కూడా అయ్యింది. కాగా ఇటీవలే తిరిగొచ్చిన ఆ మహిళకు పెళ్లవడంతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. బతికివున్న ఆ మహిళకు సంబంధించిన డెట్ సర్టిఫికెట్ తయారు చేయించి ఆమె ఆస్తిపాస్తులకు కాజేసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ ఉదంతంలో ఆమెకు మద్దతుగా నిలిచేవారు ఎవరూ లేరు. 52 ఏళ్ల అ మహిళ పేరు బుచున్ దేవి. చన్పటియాలోని గిద్దా గ్రామంలో ఆమె అత్తవారు ఉంటున్నారు.


భర్త పేరు శివపూజన్ మహతో. చుబున్ తెలిపిన వివరాల ఆమె పేరిట ఉన్న భూమిని దక్కించుకునేందుకు.. బంధువులు ఆమె చనిపోయినట్లు డెట్ సర్టిఫికెట్ తయారుచేయించారు. ఆ తరువాత ఆమెపై దాడిచేసి, ఇంటి నుంచి తరిమికొట్టారు. ఇది 1987లో జరిగింది. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఉంటూనే ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడుతోంది. ఆమె ఎంతమంది అధికారులను కలుసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఆమె తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు ఆధార్ కార్టు, పాన్ కార్టులను తయారు చేయించుకోవడంతోపాటు ఇటీవలే కరోనా టీకా వేయించుకుని ఆ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. వీటిని తీసుకుని ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతోంది. ఈ ఉదంతం గురించి పశ్చిమ చంపారణ్ డీఎం కుందన్ కుమార్ మాట్లాడుతూ చన్‌పటియా అధికారులు.. బతికున్న మహిళ పేరిట డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిరూపణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-10-29T17:14:14+05:30 IST