కత్తులు, కటార్లతో రోడ్డెక్కిన మహిళలు.. ఇళ్లలో దాక్కున్న పురుషులు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-07-22T01:19:07+05:30 IST

ఆ ఊర్లో ఆడాళ్లంతా మగాళ్ల దుస్తులు ధరించారు. కత్తులు, కర్రలు, రోకళ్లు.. ఇలా చేతికందిన ఆయుధాలు చేతబట్టారు. కాళ్లకు పెద్దపెద్ద గజ్జెలు కట్టారు. రోడ్డుపై గుంపులు గుంపులుగా వెళ్తూ.. వింతగా అరుస్తూ ఊరంతా తిరిగారు.

కత్తులు, కటార్లతో రోడ్డెక్కిన మహిళలు.. ఇళ్లలో దాక్కున్న పురుషులు.. అసలు కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఊర్లో ఆడాళ్లంతా మగాళ్ల దుస్తులు ధరించారు. కత్తులు, కర్రలు, రోకళ్లు.. ఇలా చేతికందిన ఆయుధాలు చేతబట్టారు. కాళ్లకు పెద్దపెద్ద గజ్జెలు కట్టారు. రోడ్డుపై గుంపులు గుంపులుగా వెళ్తూ.. వింతగా అరుస్తూ ఊరంతా తిరిగారు. ఇలా ఒక్క ఊళ్లో కాదు. ఆ పరిసరాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో జరిగింది. ఇదంతా అక్కడి వింత ఆచారమట. ఇంతకీ ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగితే వాళ్లు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేవేంద్రుడిని బెదిరించేందుకట! ఆశ్చర్యం కలిగించే ఈ ఆచారం రాజస్థాన్‌లోని ఆనంద్  ‌పురీ, కాలిజరా, సుల్లేపాట్ తదితర గ్రామాల్లో ఏటా కనిపిస్తుంది.


ఈ వింత ఆచారం ఈ గ్రామాల్లో సుమారు 70-80 ఏళ్లుగా అమలవుతోందట. ఈ ఆడాళ్లు గాల్లో ఆయుధాలు ఊపుతూ వింత శబ్దాలు చేస్తారట. ఈ శబ్దాల ద్వారా వాళ్లు ఇంద్రుడికి ఓ సందేశం పంపుతారట ‘‘భూమిపై దేవతలను కొలుస్తారు. నువ్వు వాళ్ల అధిపతివి. ఇలా ఉన్నప్పుడు వర్షాలు పడక పంటలు ఎండిపోతే.. పోషణ భారంగా మారుతుంది. మనుషులు క్రూరంగా మారతారు. ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్తారు. దొంగలు, బందిపోట్లుగా మారిపోతారు. దాడులు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయ్. కాబట్టి దేవతల విషయంలో మనుషుల నమ్మకాలు పోకుండా ఉండాలంటే.. నువ్వు వర్షాలు కురిపించాలి’’ అనేది ఇంద్రుడికి ఆ మహిళలు పంపే సందేశం సారాంశం. దీనిపై గ్రామంలోని వద్ధులు మాట్లాడుతూ.. ఈ ఆచారం ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదని, కానీ సుమారు 70-80 ఏళ్లుగా ఇది చూస్తూనే ఉన్నామని చెప్పారు. స్థానికంగా ‘ధాడ్’ అని పిలిచే ఈ కార్యక్రమం జరిగే సమయంలో ఇళ్లలోని పురుషులు బయటకు రాకూడదరు. కత్తులు, కటార్లు పట్టుకొని తిరిగే మహిళలకు ఎదురు పడకూడదనే నియమం కూడా ఉందిట.

Updated Date - 2021-07-22T01:19:07+05:30 IST