Chandigarh University MMS scandal: చండీగఢ్ యూనివర్సిటీ న్యూడ్ వీడియోల కుంభకోణంలో కీలక మలుపు

ABN , First Publish Date - 2022-09-27T02:41:02+05:30 IST

చండీగఢ్ యూనివర్సిటీ అమ్మాయిల నగ్న వీడియోల (Chandigarh University MMS scandal) కేసులో కీలక మలుపు

Chandigarh University MMS scandal: చండీగఢ్ యూనివర్సిటీ న్యూడ్ వీడియోల కుంభకోణంలో కీలక మలుపు

మొహాలీ: చండీగఢ్ యూనివర్సిటీ అమ్మాయిల నగ్న వీడియోల (Chandigarh University MMS scandal) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో అరెస్ట్ అయిన సంజీవ్‌‌ సింగ్ (Sanjeev Singh) ఆర్మీ వ్యక్తి (Army Man) అని తేలింది. అంతేకాదు, హాస్టల్ అమ్మాయిల నగ్న వీడియోలు పంపిన యువతి తన ప్రేయసి అని అతడు మొహాలీ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. నిందితురాలికి, సంజీవ్‌సింగ్‌కు మధ్య సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను మార్చుకున్నారు. అయితే, సంజీవ్ సింగ్‌కు కూడా నిందితురాలు హాస్టల్ అమ్మాయిల నగ్న వీడియోలు పంపిందీ, లేనిదీ తెలియరాలేదు. సంజీవ్ వద్ద రెండు మొబైల్ ఫోన్లు ఉన్నట్టు మాత్రం పోలీసులు గుర్తించారు. 


సంజీవ్‌ను ఎలా ట్రాక్ చేశారు?

ఈ కుంభకోణంలో నిందితురాలైన ఎంబీయే విద్యార్థినిని హాస్టల్ మేనేజర్ ప్రశ్నిస్తున్నప్పుడు ఆమెకు ఎవరో వరుసపెట్టి టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆమె వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా సంజీవ్‌సింగ్‌(Sanjeev Singh)తో వ్యవహారం బయటపడింది. అతడు ఆమెను ఫొటోలు, వీడియోలు పంపమని అడిగినట్టు తెలుస్తోంది. దీనిని బట్టి సహచర విద్యార్థినుల వీడియోలు తీయాలన్న ఒత్తిడి ఆమెపై ఉన్నట్టు గుర్తించారు. వీడియోలు, ఫొటోలు తీయమని చెప్పడం వల్ల తాను దొరికిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు సంజీవ్‌కు ఆమె చెప్పింది. సంజీవ్ సింగ్ కుమార్ (Sanjeev Singh) ఫోన్ నంబరును నిందితురాలు తన ఫోన్‌లో సేవ్ చేస్తూ రంకజ్ వర్మ(Rankaj Verma) ఫొటోను దానికి జోడించింది. 


నేను అమాయకుడిని..

చండీగఢ్ యూనివర్సిటీ అమ్మాయిల నగ్న వీడియోల (Chandigarh University MMS scandal) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడైన సిమ్లాకు చెందిన రంకజ్ వర్మ (Rankaj Verma) తాను అమాయకుడినని చెప్పుకొచ్చాడు. నిందితురాలి బయ్‌‌ఫ్రెండ్ సన్నీ మెహతా (Sunny Mehta) ఎవరో తనకు తెలియదని పేర్కొన్నాడు. బెయిలు కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, నిందితురాలు పెట్టుకున్న డీపీ వల్లే పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ విషయంలో అతడి తప్పేమీ లేదని రంకజ్ సోదరుడు పంకజ్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు, ఆమె బాయ్‌ఫ్రెండ్, రంకజ్ వర్మ రిమాండ్ సోమవారంతో ముగిసింది. వారి మొబైల్ ఫోన్లు, యువతి ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సహచర విద్యార్థుల నగ్న ఫొటోలను ఆమె తీసి వాటిని వీడియోలుగా మార్చిందా? లేదా? అన్నది ఈ రిపోర్టులో తేలిపోనుంది.  

Updated Date - 2022-09-27T02:41:02+05:30 IST