Viral Story: ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.. ఎన్నో లోపాలతో పుట్టిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేసిందంటే..

ABN , First Publish Date - 2022-08-08T20:54:48+05:30 IST

ఆమె పుట్టుకను తల్లి కోరుకోలేదు.. గర్భంలో ఉండగానే నిర్మూలించుకోవాలనుకుంది.. గర్భస్రావం చేయించుకుంది..

Viral Story: ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.. ఎన్నో లోపాలతో పుట్టిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఎలా ముందడుగు వేసిందంటే..

ఆమె పుట్టుకను తల్లి కోరుకోలేదు.. గర్భంలో ఉండగానే నిర్మూలించుకోవాలనుకుంది.. గర్భస్రావం చేయించుకుంది.. అయితే అబార్షన్ ఫెయిల్ అయి లోపాలతో కూడిన ఆడబిడ్డ జన్మించింది.. ఆ బిడ్డకు పుట్టుకతోనే ఒక చేయి లేదు.. కాళ్లు కూడా సగమే ఉన్నాయి.. అయినా తన లోపాలను చూసి ఆ చిన్నారి చింతించలేదు.. అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది.. సగం కాళ్లతోనే సగం ప్రపంచాన్ని చుట్టేసింది.. రేడియో జాకీగా అలరిస్తోంది.. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భారీ సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పేరు.. ఛార్లీ రౌజియా (Charlie Rousseau).


కెనడా (Canada)కు చెందిన చార్లీ పాతికేళ్ల క్రితం ఎన్నో లోపాలతో జన్మించింది. అయినా తన కలలకు ఆ లోపాలు అడ్డు రాలేదు. `నేను కూడా అందరి పిల్లల్లాగానే పెరిగాను. నాకు లోపాలు ఉన్నాయనే సంగతి నాకు 18 ఏళ్లు వచ్చే వరకు తెలియలేదు. టీనేజ్‌లోకి అడుగు పెట్టాకే నా శరీరం గురించి అవగాహన ఏర్పడింది. నేను మిగిలిన వాళ్లలా డేటింగ్ చేయడానికి కుదర్లేదు. అబ్బాయిలెవరూ నాతో స్నేహం చేయలేదు. నా కాలేజీ జీవితం నాకు చాలా కఠినంగా అనిపించింది. కానీ, అప్పుడు అలా బాధపడినందుకు ఇప్పుడు నవ్వుకుంటున్నా. ప్రస్తుతం నా జీవితంతో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. ఇప్పటికి సగం ప్రపంచాన్ని చుట్టేసి వచ్చాన`ని చార్లీ చెప్పింది. 


తన ప్రపంచ యాత్రకు సంబంధించిన ఫొటోలను, డాక్యుమెంటరీలను చార్లీ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. రేడియా హోస్ట్‌గా కూడా చార్లీ మంచి ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆమె కథ సోషల్ మీడియాలో ఎంతో మందిని మెప్పించింది. 

Updated Date - 2022-08-08T20:54:48+05:30 IST