అక్రమ సంబంధానికి భర్త అడ్డు చెప్పాడని.. ఆమె ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2022-05-05T09:54:57+05:30 IST

ఊళ్లో జరిగే ఫంక్షన్లలో పాటల కార్యక్రమాలు నిర్వహించే అర్జున్ (22) అనే యువకుడికి కొంతకాలం క్రితం పెళ్లయింది. అతని భార్య రాజకీ వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన అర్జున్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు...

అక్రమ సంబంధానికి భర్త అడ్డు చెప్పాడని.. ఆమె ఏం చేసిందంటే...

ఊళ్లో జరిగే ఫంక్షన్లలో పాటల కార్యక్రమాలు నిర్వహించే అర్జున్ (22) అనే యువకుడికి కొంతకాలం క్రితం పెళ్లయింది. అతని భార్య రాజకీ వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన అర్జున్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 


ఈ క్రమంలోనే తాజాగా భార్య రాజకీ, ఆమె ముగ్గురు సోదరులు సవాయీరామ్, మదన్, జేఠారామ్.. అర్జున్‌‌ను పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. ఊరికి దూరంగా తీసుకుపోయి మద్యం తాపించారు. మద్యం మత్తులో మళ్లీ భార్య వివాహేతర సంబంధాల గురించి చర్చ రావడంతో అర్జున్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. భార్యను తిట్టిపోశాడు. దీంతో మొత్తం ఐదుగురు కలిసి అర్జున్‌ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతన్ని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి పరారయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌లో వెలుగు చూసింది. 


విషయం తెలిసిన అర్జున్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్జున్ భార్య రాజకీకి జేఠారామ్, మదన్‌తో వివాహేతర సంబంధం ఉందని, దాన్ని ఆమె కొనసాగించాలని అనుకుందని ఆరోపించాడు. దీనికి అభ్యంతరం చెప్పినందుకే తన సోదరుడిని హత్య చేశారని కేసు పెట్టాడు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అర్జున్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.




Read more