Osmania University: ఓయూ హాస్టల్‌లో పనిచేస్తున్న మహిళ పాముకాటుతో మృతి

ABN , First Publish Date - 2022-08-11T15:20:41+05:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ మంజీరా హాస్టల్ మెస్‌లో వంట పని చేస్తున్న కవిత(45) కాంట్రాక్టు వర్కర్ పాముకాటుతో మృతి చెందింది.

Osmania University: ఓయూ హాస్టల్‌లో పనిచేస్తున్న మహిళ పాముకాటుతో మృతి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) మంజీరా హాస్టల్ మెస్‌లో వంట పని చేస్తున్న కవిత(45) కాంట్రాక్టు వర్కర్ పాముకాటు (snakebite)తో మృతి చెందింది. నిన్న విధి నిర్వహణలో ఓయూ మంజీరా హాస్టల్ మెస్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాముకాటుతో అస్వస్థతకు గురైన కవితను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ కవిత మరణించింది. ఓయూ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షమే తన భార్య మృతికి కారణమని కవిత భర్త ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కవితకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-11T15:20:41+05:30 IST