ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచేదాక పెళ్లి చేసుకోను

Published: Wed, 13 Apr 2022 20:39:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచేదాక పెళ్లి చేసుకోను

ముంబై : ‘‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ గెలిచేదాకా పెళ్లి చేసుకోను గాక చేసుకోను’’ అని ఎవరైనా క్రికెటర్ శపథం చేశారా ఏంటి అని కంగారు పడుతున్నారా?.. అలాందేమీ లేదులెండి. పెళ్లి చేసుకోబోనని భీష్మించుకు కుర్చుకున్నది ఓ ఆర్‌సీబీ అభిమానురాలు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్‌లో తన మనసులోని మాటను బ్యానర్ ద్వారా ప్రదర్శించింది. ప్రత్యక్షంగా స్టేడియంలో, పరోక్షంగా టీవీలలో మ్యాచ్‌ను వీక్షించిన వారిని ఈ బ్యానర్ ఎంతో ఆకర్షించింది. ఆర్‌సీబీ ఫ్యాన్ ప్రదర్శించిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయింది.


ఈ ఫొటోను క్రికెటర్ అమిత్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు అని ట్యాగ్ కూడా ఇచ్చాడు. దీంతో మీమ్స్‌తో నెటిజన్లు జోకులు పేల్చారు. ఫైనల్‌గా పెళ్లెప్పుడు చేసుకుంటావని చుట్టాలు అడిగితే చెప్పేందుకు ఒక కారణం తెలిసిందని ఓ యువతి రిప్లై ఇచ్చింది. ఇలా జోకుల మీద జోకులు వేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీ‌బీ ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోని విషయం తెలిసిందే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.