సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం

ABN , First Publish Date - 2021-03-08T05:02:24+05:30 IST

సమాజాభివృద్ధిలో మహిళలు ఎంతో కీలకమని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీకాకుళంలోని దిశ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో దిశ యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో మహిళలే కీలకం
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌, తదితరులు

ఎస్పీ అమిత్‌ బర్దర్‌

కొవ్వొత్తుల ర్యాలీతో దిశ యాప్‌పై అవగాహన

ఏఆర్‌ గ్రౌండ్‌లో నేడు ప్రత్యేక వైద్య శిబిరం

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 7 : సమాజాభివృద్ధిలో మహిళలు ఎంతో కీలకమని ఎస్పీ అమిత్‌బర్దర్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీకాకుళంలోని దిశ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో దిశ యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ పాల్గొన్నారు. అలాగే కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. మహిళా భద్రతే మా బాధ్యత అంటూ నగరంలో ప్రధాన జంక్షన్లలో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాముల జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ఈ యాప్‌ను ప్రతి మహిళా ఉపయోగించుకొని రక్షణ పొందాలని సూచించారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న మహిళలతోపాటు ఉద్యోగుల కుటుంబాల్లోని మహిళలకు జెమ్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం ఎచ్చెర్ల ఏఆర్‌ ప్రాంగణంలో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ శిబిరంలో 30 మంది మహిళా వైద్య నిపుణులు పాల్గొని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మెగా వైద్యశిబిరానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విఠలేశ్వర్‌, డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు, ప్రసాదరావు, మహిళా పోలీసులు, సంరక్షణా కార్యదర్శులు, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-08T05:02:24+05:30 IST