Iran-Iraq ఫుట్‌బాల్ మ్యాచ్...టెహ్రాన్ స్టేడియంలో మొట్టమొదటిసారి మహిళలకు అనుమతి

ABN , First Publish Date - 2022-01-28T18:18:34+05:30 IST

ఇరాన్-ఇరాక్ దేశాల జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మొట్టమొదటిసారి మహిళలను అనుమతించారు....

Iran-Iraq ఫుట్‌బాల్ మ్యాచ్...టెహ్రాన్ స్టేడియంలో మొట్టమొదటిసారి మహిళలకు అనుమతి

టెహ్రాన్ : ఇరాన్-ఇరాక్ దేశాల జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మొట్టమొదటిసారి మహిళలను అనుమతించారు.మూడేళ్ల తర్వాత మొదటిసారి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఇరాన్ మహిళలను అనుమతించడం విశేషం. ఆజాదీ స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు తాను హాజరు కావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని 26 ఏళ్ల మహ్య అనే మహిళా సివిల్ ఇంజినీరు చెప్పారు.ఓ యువతి ఆకుపచ్చ తెలుపు రంగు దుస్తులు ధరించి, తలపై బూదిద రంగు కండువా కప్పుకొని, ఎరుపు జెండాను చేత పట్టుకొని ఫుట్‌బాల్ మ్యాచ్‌ చూడటానికి వచ్చారు. 


ఇరాన్, ఇరాక్ జట్ల మధ్య 2022 ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ కోసం పది వేల టికెట్లలో  రెండు వేల టిక్కెట్లు మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంచారు.మహిళలను ప్రత్యేక గ్యాలరీలలో ఉంచారు.ఇస్లామిక్ రిపబ్లిక్ లో సాధారణంగా ఫుట్‌బాల్  ఇతర స్టేడియాల నుంచి మహిళా ప్రేక్షకులను సుమారు 40 సంవత్సరాల పాటు నిషేధించింది.


Updated Date - 2022-01-28T18:18:34+05:30 IST