విమెన్స్ డే: పెన్సిల్ మొనపై అద్భుత కళాకృతి

ABN , First Publish Date - 2021-03-08T17:40:25+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్...

విమెన్స్ డే: పెన్సిల్ మొనపై అద్భుత కళాకృతి

విశాఖ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ విజేత గట్టెం వెంకటేశ్ రూపొందించిన కళాకృతి అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా పెన్సిల్ మొనపై స్త్రీ మూర్తిని చెక్కారు. 10మి.మీ. ఎత్తు, 4మి.మీ.ల వెడల్పుతో ఉన్న దీన్ని చెక్కడానికి రెండు గంట సమయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ వర్ణమాలలోని వుమన్(WOMAN)‌కు ఆయన తనదైన అర్థమిచ్చారు. డబ్ల్యూ(వండర్‌ఫుల్) అంటే అద్భుతమని, ఓ(ఔట్‌స్టాండింగ్) అంటే విశిష్టమని, యం(మార్వలస్) అంటే ఆశ్చర్యం, ఏ(అమేజింగ్) అంటే ప్రీతికరమైన, ఎన్(నైస్) అంటే సున్నితమైన అనే అర్థాన్ని ఆయన ఇచ్చారు. దీన్ని తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తను చెక్కిన కళా రూపాన్ని స్త్రీ మూర్తులందరికీ అంకితమిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-03-08T17:40:25+05:30 IST