ఉన్నత విద్యతోనే మహిళాభివృద్ధి

ABN , First Publish Date - 2021-11-26T05:06:28+05:30 IST

ఉన్నత విద్యతోనే మహిళాభివృద్ధి సాధ్యమని ఉమెన్‌ రైట్స్‌ చైర్‌పర్సన్‌ న్యాయవాది ఝాన్సీ రాణి అన్నారు.

ఉన్నత విద్యతోనే మహిళాభివృద్ధి
మాట్లాడుతున్న డీఎస్పీ కిశోర్‌కుమార్‌

న్యాయవాది ఝాన్సీ రాణి

పెద్ద దోర్నాల, నవంబరు 25 : ఉన్నత విద్యతోనే మహిళాభివృద్ధి సాధ్యమని ఉమెన్‌ రైట్స్‌ చైర్‌పర్సన్‌  న్యాయవాది ఝాన్సీ రాణి అన్నారు.స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో ఆర్‌డీటీ సం స్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్ర్తీ హింస నిర్మూలన దినం సందర్భంగా కార్యక్రమాన్ని గురువారం  నిర్వహించారు. ఝాన్సీ రాణి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రజల్లో చైతన్యం కొరవడితే ఫలితం లేదన్నారు. ముఖ్యంగా చెంచు గిరిజనులు అధిక శాతం నిరక్ష్యరాస్యత వల్ల చాలా వెనుకబడి ఉన్నారని, ఇప్పుడిప్పుడే చైతన్యవంతులవుతున్నారన్నారు. వారి అభివృద్ధికి ఆర్‌డీటీ చేస్తున్న కార్యక్రమాలను ఆమె అభినం దించారు.  చిన్న వయస్సులోనే వివాహాలు  చేయొద్దన్నారు. పిల్లలను బ డికి పంపించాలని సూచించారు. ఆర్‌డీటీ డీఐడీ సెక్టార్‌ డైరెక్టర్‌ దశరథ్‌, మార్కాపురానికి చెందిన న్యాయవాది ఉమెన్‌ రైట్స్‌ చైర్‌ పర్సన్‌ ఝాన్సీ రా ణి హాజరయ్యారు. దశరథ్‌ మాట్లాడుతూ స్ర్తీ హింసకు ప్రధానంగా పురుషులు కారణమవుతున్నారని హేయమన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని వారికి సరైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా బాలికలు ఆలపించిన పలు చైతన్య గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్థ డీటీఎల్‌ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

చైతన్యంతోనే హింసకు అడ్డుకట్ట : డీఎస్పీ

ఎర్రగొండపాలెం  : మహిళలు చైతన్యవంతులు అయినప్పుడే హింసకు అడ్డుకట్ట పడుతుందని మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలనా దినం సందర్భంగా ఎర్రగొండపాలెంలోని ఆర్‌డీటీ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ జిల్లా పీడీ లక్ష్మీదేవి, సీడీపీవో ఎం పద్మావతి, తెనాలి రెడ్‌క్రాస్‌చైర్మన్‌ ఉమ్మనేని భారతి, ఆర్డీటీ ఏటీఎల్‌ రామాంజనేయులు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T05:06:28+05:30 IST