లౌక్యంతోనే మహిళా సాఽధికారత, మార్పు

ABN , First Publish Date - 2021-03-06T06:08:57+05:30 IST

స్ర్తీలు పనిచేసే చోట లౌక్యం ప్రదర్శిస్తూ, వేధిం పుల నివారణ చట్టంపై అవగాహన కల్గిఉండి మానసికంగా వేధింపులు ఎదర్కునే సన్నద్దత కలిగినప్పుడే మహిళా సాఽధికారతతో పాటు సమాజంలో మార్పు సా ధ్యం అవుతుందని వక్తలు తమ అభిప్రాయం తెలియజేశారు.

లౌక్యంతోనే మహిళా సాఽధికారత, మార్పు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న న్యాయవాది ఉమాదేవి

లైంగిక వేధింపుల నివారణ చట్టం అవగాహన సదస్సులో వక్తల మనోగతం 

జగిత్యాల అర్బన్‌,  మార్చి 5: స్ర్తీలు పనిచేసే చోట లౌక్యం ప్రదర్శిస్తూ, వేధిం పుల నివారణ చట్టంపై అవగాహన కల్గిఉండి మానసికంగా వేధింపులు ఎదర్కునే సన్నద్దత కలిగినప్పుడే మహిళా సాఽధికారతతో పాటు సమాజంలో మార్పు సా ధ్యం అవుతుందని వక్తలు తమ అభిప్రాయం తెలియజేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఏ హాల్‌లో సఖికేంద్రం,స్ర్తీ శిశు సంక్షేమ శాఖల సంయు క్త ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ని వారణ, రక్షణ, పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా కార్యక్రమానికి వచ్చిన వక్తలు మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చెయ్యడం అంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హ క్కులను కాలరాయడమేనని అన్నారు. ఏ బాధిత స్ర్తీ అయిన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే బాఽధిత మహిళకు నిర్ధిష్ట వ్యవధిలో న్యాయం జరిగేలా చట్టం రూ పొందించబడిందని పేర్కొన్నారు. పనిచేసే స్థలంలో వేధింపులకు గురైన స్ర్తీలు మౌనం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేసినప్పుడే తగిన న్యాయం జరుగుతుందన్నా రు. ఫిర్యాదు చేయలేని స్థితిలో 100, 181 ఫోన్‌ నెంబర్స్‌ ద్వారా కంప్లైంట్‌ చేయ వచ్చునని సూచించారు. చట్టాలపై ప్రతి మహిళ పరిపూర్ణ అవగాహన కలిగి ఉం డాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీబ్ల్యూవో నరేష్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీలత, సఖి నిర్వాహకురాలు జయశ్రీ, అడ్మిన్‌ మనీలా, సీఐ జయేష్‌రెడ్డి, మహిళా ఎస్సైలు నవత, రాజప్రమీలా, న్యాయవాదులు ఉమాదేవి, సురేంధర్‌, సఖి సిబ్బంది లావణ్య, నరేష్‌, రఽశీవాణి, గౌతమి, స్వప్న, అశ్విని, శారద, సంధ్య, అనురాధ, సామాజిక సేవకురాలు నీలిమతో పాటు వివిధ సంస్థల్లో పనిచేసే మ హిళా ఉద్యోగులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-03-06T06:08:57+05:30 IST