WETA: అమెరికాలోని మూడు నగరాల్లో 'వేటా' బతుకమ్మ వేడుకలు!

ABN , First Publish Date - 2022-09-20T18:12:49+05:30 IST

ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సంస్థ వారు బతుకమ్మ వేడుకలను విశ్వవేదికైన అమెరికాలోని పలు నగరాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

WETA: అమెరికాలోని మూడు నగరాల్లో 'వేటా' బతుకమ్మ వేడుకలు!

వాషింగ్టన్: ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) సంస్థ వారు బతుకమ్మ వేడుకలను విశ్వవేదికైన అమెరికాలోని పలు నగరాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబరాల సంస్కృతిని తెలియజేస్తూ ఘనంగా నిర్వహించేందుకు 'వేటా' సంస్థ వారు పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. సెప్టెంబర్ 25 నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే.   


‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్’  స్థాపించినప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి సెప్టెంబర్ 25 నుంచి వేడుకలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 25న వాషింగ్టన్ డీసీ, వర్జీనియా నగరాల్లో, అలాగే అక్టోబర్ 1న శాన్‌ఫ్రాన్సిస్కో పరిధిలోని బే ఏరియాలోని సాన్ రమోన్ నగరం, అక్టోబర్ 2న న్యూ జెర్సీ (Newjersey) ఈ వేడుకలు వేటా (WETA) ఆధ్వర్యంలో జరగనున్నాయి. అయితే ఈ ఏడాది వేడుకలకు ప్రముఖ సినిమా తార/టీవీ Anchor ఉదయ భాను ప్రత్యేక ఆకర్షణ. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయ వంతం చేయాలని వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ (advisory) కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ మనవి చేసింది.




Updated Date - 2022-09-20T18:12:49+05:30 IST