మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత

ABN , First Publish Date - 2022-05-19T05:06:12+05:30 IST

మహిళలు స్వయం శక్తితో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ ద్వారా తగిన చేయూత నిస్తుందని డీఆర్‌డీఏ వైఎ్‌సఆర్‌కేపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బాబూరావు అన్నారు. మండలంలోని రేణంగివరం గ్రామంలో 16 నెంబరు జాతీయ రహదారి సమీపంలో మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన వీరమ్మ ఎస్‌హెచ్‌. గ్రూపు సభ్యురాలు రజనీకుమారి స్థాపించిన ఆర్‌కే పేపర్‌ ప్లేట్స్‌ అండ్‌ షీట్స్‌ చిన్నతరహా పరిశ్రమను ఆయన బుధవారం ప్రారంభించారు.

మహిళలు ఆర్థికంగా  ఎదిగేందుకు చేయూత
రేణంగివరంలో పేపర్‌ ప్లేట్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్న వైఎ్‌సఆర్‌కేపీ పీడీ బాబూరావు

పంగులూరు, మే 18 : మహిళలు స్వయం శక్తితో చిన్నతరహా పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ ద్వారా  తగిన చేయూత నిస్తుందని  డీఆర్‌డీఏ  వైఎ్‌సఆర్‌కేపీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బాబూరావు అన్నారు. మండలంలోని రేణంగివరం గ్రామంలో 16 నెంబరు జాతీయ రహదారి సమీపంలో మద్దిపాడు మండలం గాజులపాలెం గ్రామానికి చెందిన వీరమ్మ ఎస్‌హెచ్‌. గ్రూపు సభ్యురాలు రజనీకుమారి స్థాపించిన ఆర్‌కే పేపర్‌ ప్లేట్స్‌ అండ్‌ షీట్స్‌ చిన్నతరహా పరిశ్రమను ఆయన బుధవారం  ప్రారంభించారు. రూ. 20 లక్షల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ యూనిట్‌కు గుండ్లాపల్లి కెనరా బ్యాంక్‌ రూ. 15 లక్షలు రుణ సహాయం అందించగా  డీఆర్‌డీఏ నుంచి ఏభై శాతం సబ్సిడీపై ఐదు లక్షల రుణ సహాయం అందించారు. ఈ పేపర్‌ ప్లేట్‌ తయారీ యూనిట్‌ ద్వారా 50 ఎస్‌హెచ్‌ గ్రూపులకు తక్కువ ఖర్చుతో రా మెటీరియల్‌ అందిస్తున్నామని, మెటీరియల్‌ కోసం విజయవాడ, హైదరాబాద్‌ లాంటి పట్టణాలకు వెళ్లే అవసరం ఉండదని  పీడీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌, డీపీఎం పి.డేవిడ్‌, పంగులూరు, మద్దిపాడు ఏపీఎంలు బాచిన సురేంద్ర, బత్తుల నరేంద్ర, సీసీ తుళ్ళూరి శ్రీనివాసరావు, రజనీకుమారి , మాజీ సర్పంచ్‌ అమృతపూడి ఏసోబు, ఎస్‌హెచ్‌. గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T05:06:12+05:30 IST