మాట్లాడుతున్న ఉమెన్‌ఫోర్స్‌ కన్వీనర్‌ శారద, తదితరులు

ABN , First Publish Date - 2022-05-25T04:10:50+05:30 IST

జిల్లాలోని సీతారామపురం మోడల్‌ స్కూల్‌లో బాలికల పట్ల అక్కడ పనిచేస్తున్న ఒక చిరుద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన లేదని కావలి ఉమెన్స్‌ఫోర్స్‌ కన్వీనర్‌ చాకలికొండ శారద పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ఉమెన్‌ఫోర్స్‌ కన్వీనర్‌ శారద, తదితరులు
మాట్లాడుతున్న ఉమెన్‌ఫోర్స్‌ కన్వీనర్‌ శారద, తదితరులు

కావలి, మే 24: జిల్లాలోని సీతారామపురం మోడల్‌ స్కూల్‌లో బాలికల పట్ల అక్కడ పనిచేస్తున్న ఒక చిరుద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన లేదని కావలి ఉమెన్స్‌ఫోర్స్‌ కన్వీనర్‌ చాకలికొండ శారద పేర్కొన్నారు. కావలి జర్నలిస్ట్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొంత కాలంగా అక్కడ పనిచేస్తున్న చిరుద్యోగి ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిన్న విషయం తమ దృష్టికి రాగా నిజనిర్ధారణ కమిటీగా తాము అక్కడకు వెళ్లామన్నారు. అక్కడ  విద్యార్థిని తల్లిని విచారించగా ఆమె చెప్పటానికి భయపడుతోందన్నారు. కొందరు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఆ చిరుద్యోగి అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటకు తీస్తానని చెప్పడంతో ఆయన కూడా చర్యలకు భయపడుతున్నారని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారికి కొందరు పోస్ట్‌ ద్వారా ఫిర్యాదు చేసినా ఆయన కూడా స్పందించలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్కడ ఆ చిరుద్యోగి చేస్తున్న అసభ్య ప్రవర్తనలను కట్టడి చేసి ఆయనపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థినుల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమెన్స్‌పోర్స్‌ కోకన్వీనర్‌ అమరజ్యోతి, సభ్యులు సుజాత, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T04:10:50+05:30 IST