Viral Video: ఎయిర్ పోర్ట్‌లో షాకింగ్ సీన్.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయిన మహిళలు.. మద్యం బాటిళ్లతో..

Published: Thu, 18 Nov 2021 12:31:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఎయిర్ పోర్ట్‌లో షాకింగ్ సీన్.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయిన మహిళలు.. మద్యం బాటిళ్లతో..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. వాళ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం బాటిళ్లతో విమానాశ్రయంలో తిరుగుతూ హల్‌చల్ చేశారు. ప్రయాణికుల వద్దకు వెళ్లి, ఫ్రీగా మద్యాన్ని తాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మహిళలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణం ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని మియామికి ఇద్దరు మహిళలు సరదాగా బయటికి వెళ్లి, ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారేమో.. పెద్ద పెద్ద మద్యం బాటిళ్లను లగేజ్‌లో పెట్టుకుని సరాసరి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే వారికి అక్కడ ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆ ఇద్దరు మహిళలను ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఎక్కువ పరిమాణంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా వాళ్లు షాకయ్యారు.


అంతేకాకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. లగేజ్ నుంచి మద్యం బాటిళ్లను బయటకు తీసి, హల్‌చల్ చేశారు. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులకు ఫ్రీగా మద్యాన్ని ఆఫర్ చేశారు. బాటిళ్లను వారికి ఇచ్చి వారితో మద్యం తాగించారు. ఈ నేపథ్యంలో అక్కడున్న కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి, నెట్టింట పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఇప్పటి వరకూ ఈ వీడియోను 12 మిలియన్ల మంది వీక్షించారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు.. స్పందిస్తూ.. ‘నేను అక్కడ లేకపోవడంతో.. అందులో పాల్గొనలేకపోయాను. ఈ విషయం నన్ను తీవ్ర నిరాశలోకి నెట్టింది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

అమెరికా నగరాల్లోLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.