
మహిళలకు టాక్సీ నడిపే అవకాశం కల్పించిన ఒమన్
మస్కట్: ఇటీవల సౌదీ అరేబియా మహిళలకు టాక్సీ డ్రైవర్లుగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా సౌదీ బాటలోనే మరో గల్ఫ్ దేశం ఒమన్ మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒమన్ కూడా మహిళలకు టాక్సీ నడిపే అవకాశం కల్పించింది. ఒమన్ రాజధాని మస్కట్లో ట్రయల్ బేసిస్లో రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మహిళలకు ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు గురువారం మత్రిత్వశాఖ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. జనవరి 20 నుంచి ట్రయల్ బేసిస్లో మస్కట్ గవర్నరేట్ పరిధిలో మాత్రమే ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇది సక్సెస్ అయితే మిగతా గవర్నరేట్లకు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఇక ఒమన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశంలోని మహిళలకు సువర్ణవకాశం అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి