ఇస్లామిక్ పద్దతిలో లేవని మహిళా బొమ్మల తలలు నరికేశారు

ABN , First Publish Date - 2022-01-06T00:51:59+05:30 IST

మహిళా బొమ్మలే కాదు, పురుషుల బొమ్మలను కూడా ఇలాగే చేస్తున్నారు. పురుషుల బొమ్మల తలలు తీయడం, లేదంటే చెత్తకుప్పలో పడేయడం, లేదంటే తలలపై ముసుగులు వేయడం లాంటివి చేస్తున్నారట. ఇవే కాదు స్నోమెన్ బొమ్మల తలలు కూడా నరుకుతున్నారట..

ఇస్లామిక్ పద్దతిలో లేవని మహిళా బొమ్మల తలలు నరికేశారు

కాబూల్: ఇస్లామిక్ పద్దతిలో లేవని బట్టల దుకాణాల్లోని మహిళా బొమ్మల తలలు నిరికి వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒమారింది. అప్ఘానిస్తాన్‌ని పాలిస్తున్న తాలిబన్లు అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మంచి ఉదాహారణ అంటున్నారు. దశాబ్దాలుగా అఫ్ఘానీలను హింసిస్తూ ప్రాణాలు తీస్తున్నది సరిపోక ఇప్పుడు బొమ్మల తలలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘తాలిబన్ల టెర్రరిజం, వారి సంకుచిత మనస్తత్వం మరింత అధమ స్థాయికి దిగజారింది. 25 ఏళ్లుగా అఫ్ఘానీ ప్రజలను హింసిస్తున్నారు. అది సరిపోలేదేదమో ఇస్లాం పేరు మీద ఇప్పుడు బొమ్మల తలలు నరికి తృప్తి పొందుతున్నారు’’ అని రాసుకొచ్చారు. ‘తాలిబన్‌ను గుర్తించకండి’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. కొన్ని బొమ్మల తలలు నరకివేస్తుండగా కొన్నింటిని చెత్తలో విసిరివేస్తున్నారట. మహిళా బొమ్మలే కాదు, పురుషుల బొమ్మలను కూడా ఇలాగే చేస్తున్నారు. పురుషుల బొమ్మల తలలు తీయడం, లేదంటే చెత్తకుప్పలో పడేయడం, లేదంటే తలలపై ముసుగులు వేయడం లాంటివి చేస్తున్నారట. ఇవే కాదు స్నోమెన్ బొమ్మల తలలు కూడా నరుకుతున్నారట.

Updated Date - 2022-01-06T00:51:59+05:30 IST