
అమరావతి: చట్టానికి ఎవరూ అతీతులు కారని హోం మంత్రి వనిత తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యకి ఎవరైతే ప్రేరేపించారో వారికి తప్పకుండా శిక్ష ఉంటుందని చెప్పారు. హత్య ఘటన చాలా దారుణమన్నారు. తల్లి, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వాలన్నారు. బిడ్డలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలని వనిత పేర్కొన్నారు. తల్లి పాత్ర సరిగా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వనిత అన్నారు.
ఇవి కూడా చదవండి