మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

ABN , First Publish Date - 2021-04-24T04:22:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లి లక్ష్మిదేవి అన్నారు.

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
డ్వాక్రా సంఘాలకు చెక్‌ను అందజేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మిదేవి

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 23 : రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లి లక్ష్మిదేవి అన్నారు. స్థానిక మున్సిపల్‌ సభాభవనంలో శుక్రవారం వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పఽథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పేద మహిళల అర్ధికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి, ఆసరాగా నిలుస్తోందన్నారు. కమిషనర్‌ రాధ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పఽథకం కింద 4945 సంఘాల లబ్ధ్దిదారులకు రూ.7.30 కోట్లు మంజూరైందన్నారు. ప్రతి సంఘానికి రూ.15 వేలు అందజేయడం జరుగుతుందన్నారు.  ప్రొద్దుటూరులో వంద మంది లబ్ధ్దిదారులతో పేపర్‌బ్యాగుల తయారీతో పాటు ఇతర రంగాల్లో శిక్షణ ఇచ్చి, ప్రొత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మెప్మా సీఈవో కేజీయా, ఏపీవో సుబ్బారెడ్డి, ఎంపీడీవో సుబ్రమణ్యం, రమణారెడ్డి, శివరాం, లక్ష్మిదేవి, లలిత, డ్వాక్రా సంఘాల సభ్యులు న్నారు. 

Updated Date - 2021-04-24T04:22:52+05:30 IST