మహిళలు స్వేచ్ఛగా ముందడుగు వేయాలి

ABN , First Publish Date - 2021-03-09T05:57:27+05:30 IST

మహిళలు స్వేచ్ఛగా ముందడుగు వేయాలని, అపుడే మహిళా సాధికారిత సాధ్యమౌతుందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో

మహిళలు స్వేచ్ఛగా ముందడుగు వేయాలి
కలెక్టర్‌ సి.హరికిరణ్‌ను సన్మానిస్తున్న మహిళా అధికారులు

కలెక్టర్‌ సి.హరికిరణ్‌

కడప(కలెక్టరేట్‌), మార్చి 8: మహిళలు స్వేచ్ఛగా ముందడుగు వేయాలని, అపుడే మహిళా సాధికారిత సాధ్యమౌతుందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు జేసీ ఎం.గౌతమి, మొదటి జిల్లా అదనపు జడ్జి, జువైనల్‌ జస్టిస్‌ బోర్డు చైర్‌పర్సన ప్రత్యూష కుమారి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రియాజ్‌ అహమ్మద్‌, జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన శివకామిని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడపిల్లలపై చిన్నచూపు తగదన్నారు. దేశంలో స్ర్తీ, పురుషుల నిష్పత్తిలో అసమానతలు తొలగించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమన్నారు. గండికోట రిజర్వాయర్‌లో లక్ష్యాన్ని అధిగమించే విషయంలో, 26 టీఎంసీల నీరు నింపడంలో జేసీ గౌతమి సేవలు అభినందనీయమని కలెక్టర్‌ కొనియాడారు. రెవెన్యూలో డిప్యూటి కలెక్టర్లు సుజన, రోహిణి, రిటైర్డ్‌ డీఎంఅడ్‌ హెచఓ డాక్టర్‌ ఉమాసుందరి లాంటి మహిళా అధికారుల ఉద్యోగ సేవలు మహిళలకు స్ఫూర్తినిస్తాయన్నారు. జేసీ గౌతమి మాట్లాడుతూ పిల్లలకు తొలి గురువు మహిళలే అన్నారు. మహిళలు ఉద్యోగ రంగాల్లో తమ కుటుంబ బాధ్యతను మరువరని అదే వారి గొప్పతనమన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన మహిళలను కలెక్టర్‌ , జడ్జి చేతుల మీదుగా సత్కరించారు. మహిళలు అందరూ కలసి కలెక్టర్‌ హరికిరణ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు డాక్టర్‌ రామ చంద్రారెడ్డి, ఐసీడీసీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:57:27+05:30 IST