చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-03-09T05:36:46+05:30 IST

మహిళల కోసం రూపొందించిన చట్టాలపై వారు పెంపొందించుకోవాలని రాజాం జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.స్వాతి పిలుపునిచ్చారు.

చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం

రాజాం రూరల్‌: మహిళల కోసం  రూపొందించిన చట్టాలపై వారు  పెంపొందించుకోవాలని రాజాం జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.స్వాతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సెయింటాన్స్‌ స్త్రీశక్తి పరస్పర సహకార సంఘ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన  సవస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు.  మండల న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో నిర్వహంచిన  కార్యక్రమంలో రాజాం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వై.వి.రమణ, కార్యదర్శి విజయకుమార్‌, ఎస్‌.ఐ. రేవతి, సెయింటాన్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ మేరీ విజయ తదితరులు పాల్గొన్నారు. 

అడ్డంకులను అధిగమించి ముందుకు సాగండి

కోటబొమ్మాళి: లక్ష్యసాధనకు అడ్డంకులను మహిళలు అధిగమించి ముందుకు సాగాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయసేవా సంఘం అధ్యక్షుడు  కె.ప్రకాశ్‌బాబు అన్నారు. స్థానిక మహిళా శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో  సోమవారం నిర్వహించిన  ప్రత్యేక నాయవిజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. మహిళలకు అదర్శవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మహిళా చట్టాలపై అవగాహన  కల్పించారు. ఎంపీడీవో బడే రాజేశ్వరరావు మహిళలపై పాడిన పాట  అందరి కంట తడి పెట్టించింది. కార్యక్రమంలో న్యాయవాదులు పల్లి వాసుదేవరావు, వి. అప్పలనాయుడు, కె.కృష్ణమూర్తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ కె.సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. 

నరసన్నపేట: మహిళలు హక్కులను పరిరక్షించుకునేందుకు న్యాయస్థానాలు అండగా ఉన్నాయని స్థానిక సివిల్‌ కోర్టు జడ్జి జి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో  సోమవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళలు వివక్షకు  గురికాకుండా  ఉండేందుకు ఎన్నో  చట్టాలు ఉన్నాయన్నారు. వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  ఇప్పిలి తాతబాబు, ధర్మాన వెంకటరమణ, కె.ధనలక్ష్మి, బలగ అనంతరావు  ఉన్నారు.

Updated Date - 2021-03-09T05:36:46+05:30 IST