సచివాలయ మహిళా పోలీసులు పోలీస్‌ శాఖలో అంతర్భాగం

ABN , First Publish Date - 2021-07-30T05:19:02+05:30 IST

సచివాలయ మహిళా పోలీసులు ఇక నుంచి పోలీస్‌ శాఖలో అంతర్భాగమని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు.

సచివాలయ మహిళా పోలీసులు పోలీస్‌ శాఖలో అంతర్భాగం
సచివాలయాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతున్న అర్బన్‌ ఎస్పీ

  • రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
  • నగరంలోని పలు సచివాలయాల పరిశీలన

రాజమహేంద్రవరం సిటీ, జూలై 29: సచివాలయ మహిళా పోలీసులు ఇక నుంచి పోలీస్‌ శాఖలో అంతర్భాగమని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు సచివాలయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళా పోలీసులతో మాట్లా డారు. వార్డు సచివాలయాల సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ప్రతినిధులుగా వ్యవ హరించాలని సూచించారు. వార్డు వలంటీర్ల సహాయంతో స్కూల్స్‌, కాలేజీలు, అంగన్‌వాడీల మధ్య మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వ హించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్‌ గురించి వార్డు మహిళా పోలీసులు తమ పరిధిల్లోని మహిళలకు అంటే ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, మహిళా ఉద్యోగుల్లో దిశా యాప్‌పై అవగాహన కలిగించి ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు మహిళా పోలీసులు భవిష్యత్‌ సమాజంలో రాబోయే మంచి మార్పులకు కారకులవుతారని చెప్పారు. మహిళా పోలీసులు తమకు అప్పగించిన బాధ్యత లను, చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:19:02+05:30 IST