చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-26T04:54:51+05:30 IST

వైఎస్‌ఆర్‌ చేయూతను మహిళలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీషా తెలిపారు.

చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళలకు మెగా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి టౌన్‌, సెప్టెంబరు 25: వైఎస్‌ఆర్‌ చేయూతను మహిళలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీషా తెలిపారు. ఆదివారం రాయచోటి మండలంలోని చెన్నముక్కపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వైఎ్‌సఆర్‌ చేయూత మూడో విడతను చెక్కులను కలెక్టర్‌, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం వేదిక నుంచి ఈనెల 23వ తేదీ మహిళలకు వైఎ్‌సఆర్‌ చేయూత పథకం కింద మూడో విడత ఆర్థిక సాయం పంపిణీ చేశారని తెలిపారు. జిల్లాలో 79,157 మంది లబ్ధిదారులకు రూ.148.42 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, మహిళలు, జీవన శైలిలో మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, ఏపీఐఐసీ డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ మమత, ఎంపీటీసీలు, తహసీల్దార్‌, ఎంపీడీవో, సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:54:51+05:30 IST