చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-23T05:49:55+05:30 IST

మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

చేయూతను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
చేయూత పథకం చెక్‌ను అందిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ తదితరులు


ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి 

13,270 మందికి రూ.24.87 కోట్లు జమ 

పాడేరు, జూన్‌ 22: మహిళలకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణతో కలిసి రెండో విడత చేయూత పథకాన్ని ఆమె మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. పాడేరు నియోజకవర్గంలో 13,279 మందికి రూ.24.87 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు. మహిళలకు వెలుగు ద్వారా ఆహార పదార్థాల తయారీపై తగిన శిక్షణ అందించి ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా గిరిజన ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి గిరిజన ఉత్పత్తుల విక్రయాలు ముమ్మరం చేయాలని   సూచించారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుందని, చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు కొనుగోలు చేయాలన్నారు. అనంతరం చేయూత పథకంలో భాగంగా లబ్థిదారులకు రూ.24.87 కోట్ల చెక్కను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అందజేశారు. ఈకార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళీ, ఎంపీడీవో నరసింహరావు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఎం.గాయత్రిదేవీ, వెలుగు ఏరియా కో-ఆర్డినేటర్లు కె.నీలాచలం, కె.అన్నపూర్ణ, ఏపీఎం కళావతి, సర్పంచ్‌ కె.ఉషారాణి, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:49:55+05:30 IST