‘ఓయో’లో కలుద్దామా అన్న బాస్.. షాకిచ్చిన యువతి!

ABN , First Publish Date - 2021-08-31T21:09:30+05:30 IST

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అనన్య అనే ఓ యువతికి ఆమె బాస్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఆ వాట్సాప్ చాట్ బహిర్గతం చేస్తోంది. ప్రాజెక్ట్‌ను అప్రూవ్ చేయాలన్నా, శాలరీ హైక్ వచ్చేలా చేయాలన్నా...

‘ఓయో’లో కలుద్దామా అన్న బాస్.. షాకిచ్చిన యువతి!

ఇంటర్నెట్ డెస్క్: మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడానికి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. మహిళలు, టీనేజ్ యువతులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆటకట్టించేందుకు షీటీమ్స్ డెకాయ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వేధింపులపై ఎలా స్పందించాలి?.. ఆ విషయంపై పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలి? అనేదానిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సరికొత్తగా అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఓ వాట్సాప్ చాటింగ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది.


సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అనన్య అనే ఓ యువతికి ఆమె బాస్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఆ వాట్సాప్ చాట్ బహిర్గతం చేస్తోంది. ప్రాజెక్ట్‌ను అప్రూవ్ చేయాలన్నా, శాలరీ హైక్ వచ్చేలా చేయాలన్నా అంతా తన చేతుల్లో ఉందని, అందుకోసం ‘ఓయో’లో కలుద్దామని అసభ్యంగా ప్రవర్తించిన తన బాస్‌కు ఆమె బుద్ధి చెప్పిన విధానం ఇతర యువతులకు అవగాహన కల్పించేలా ఉంది. వేధింపులకు కుంగిపోకుండా, అవలి వ్యక్తులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చనేలా ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఈ వాట్సాప్ చాట్‌ను షేర్ చేసింది. ఇలా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2021-08-31T21:09:30+05:30 IST