వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-22T06:11:08+05:30 IST

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

పెనమలూరు, ఏప్రిల్‌ 21: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం పెదపులిపాకలో చోటుచేసుకుంది. ఉయ్యూరుకు చెందిన అరుణకు 2013లో పెదపులిపాకకు చెందిన మానికొండ శివకోటేశ్వరరావుతో వివా హం జరిగింది.  వివాహ సమయంలో వరకట్నం కింద ఇచ్చిన రెండు సెంట్ల స్థలాన్ని తమ పేరిట రిజిస్ర్టేషన్‌ చేయాలని భర్తతో పాటు అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, ఏడుకొండలు వేధిస్తుండటంతో మానసిక క్షోభతో బుధవారం గ్రామంలోని ఇంటిపైన ఖాళీగా ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-04-22T06:11:08+05:30 IST