అదరగొట్టిన నోవాస్‌

Published: Tue, 24 May 2022 04:06:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అదరగొట్టిన నోవాస్‌

నేటి మ్యాచ్‌  

వెలాసిటి Xనోవాస్‌    (మ. 3.30కి)

చెలరేగిన పూజ

మహిళల టీ20 చాలెంజ్‌ 

పుణె : మహిళల టీ చాలెంజ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ట్రయల్‌బ్లేజర్స్‌కు సూపర్‌ నోవాస్‌ షాకిచ్చింది. పూజా వస్ర్తాకర్‌  (4/12) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నోవాస్‌ 49 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నోవాస్‌ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆటౌటైంది. టోర్నీ చరిత్రలో ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (29 బంతుల్లో 4 ఫోర్లతో 37) టాప్‌ స్కోరర్‌కాగా..హర్లీన్‌ డియోల్‌ (19 బంతుల్లో 5 ఫోర్లతో 35), డాటిన్‌ (17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32) సత్తా చాటారు. హేలీ మాథ్యూస్‌ మూడు, సల్మా ఖాతూన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.


ఛేదనలో ట్రయల్‌బ్లేజర్స్‌ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 114 పరుగులే చేసింది. కెప్టెన్‌ స్మృతి మంధాన (23 బంతుల్లో 4 ఫోర్లతో 34), జెమీమా రోడ్రిగ్స్‌ (21 బంతుల్లో 4 ఫోర్లతో 24), హేలీ మాథ్యూస్‌ (14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 18) మాత్రమే రాణించారు. ఎకెల్‌స్టోన్‌, అలనా కింగ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. పూజా వస్ర్తాకర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.