Uttar Pradesh: ఎట్టకేలకు లభించిన న్యాయం.. ఆరేళ్ల విచారణ తర్వాత నిందితుడికి శిక్ష.. ఫలించిన మహిళ కుటుంబ సభ్యుల న్యాయపోరాటం..

ABN , First Publish Date - 2022-09-07T20:40:48+05:30 IST

ఆ మహిళ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమెకు కష్టాలే ఎదురయ్యాయి.

Uttar Pradesh: ఎట్టకేలకు లభించిన న్యాయం.. ఆరేళ్ల విచారణ తర్వాత నిందితుడికి శిక్ష.. ఫలించిన మహిళ కుటుంబ సభ్యుల న్యాయపోరాటం..

ఆ మహిళ ఏడేళ్ల క్రితం వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన ఆమెకు కష్టాలే ఎదురయ్యాయి.. వరకట్నం కోసం భర్త వేధించడం ప్రారంభించాడు.. ఆ వేధింపులు భరించలేక పెళ్లైన ఏడాదికే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. తమ కూతురి ఆత్మహత్యకు అల్లుడే కారణమంటూ ఆ మహిళ తల్లిదండ్రులు కేసు పెట్టారు.. ఆరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది.. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి..


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మొయిన్‌పురికి చెందిన సోనూ ఖాన్‌కు 2015లో రేఖా బేగంతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రేఖను వరకట్నం (Dowry Harassment) కోసం సోనూ వేధించాడు. తరచుగా కొట్టేవాడు. భర్త వేధింపులు భరించలేక రేఖ 2016 నవంబర్‌లో ఆత్మాహుతి చేసుకుంది. విషయం తెలుసుకున్న రేఖ తల్లి సందల్.. అల్లుడిపై ఫిర్యాదు చేసింది. చావుబతుకుల్లో ఉన్న రేఖ తన భర్త వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనూను అరెస్ట్ చేశారు. 


ఈ కేసుపై కోర్టు సుదీర్ఘంగా విచారించింది. సోనూ తన భార్య రేఖను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు విచారణంలో తేలింది. కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తమ పోరాటం ఫలించినందుకు రేఖ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-07T20:40:48+05:30 IST