రాజ్యాంగ స్ఫూర్తి తో పని చేయాలి : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2022-01-26T22:31:25+05:30 IST

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా..

రాజ్యాంగ స్ఫూర్తి తో పని చేయాలి : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా.. ప్రజాస్వామ్య పరిరక్షణే ధేయంగా నడుచుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం మహిళ కమీషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి జాతీయ పతాకావిష్క‌ర‌ణ చేసి గౌర‌వ వంద‌నం చేశారు. ఈ సందర్భంగా భార‌త స్వాతంత్రోద్యమంలో, న‌వ భార‌త నిర్మాణంలో కీల‌క పాత్ర పోషించిన మ‌హ‌నీయుల‌ను స్మ‌రించుకొని వారి చిత్ర‌ప‌టాల‌కు పూలదండ‌లు వేసి నివాళులు అర్పించారు. 


భారత రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించిందని ఆ హక్కులను వినియోగించుకోవాలని కోరారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన తక్షణమే మహిళా కమిషన్ ను ఆశ్రయించాలని అన్నారు. మహిళలకు కమిషన్ అన్ని విధాలా సహాయపడుతుందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ ఆఫ్రోజ్, సెక్రెటరీ కృష్ణ కుమారి పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T22:31:25+05:30 IST