మహిళాభ్యున్నతితోనే సమాజాభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-09T04:32:01+05:30 IST

మహిళాభ్యున్నతితోనే సమాజాభివృద్ధి సాధ్యమని కావలి మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి పేర్కొన్నారు.

మహిళాభ్యున్నతితోనే సమాజాభివృద్ధి
పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న కమిషనర్‌

మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కావలిటౌన్‌, మార్చి 8: మహిళాభ్యున్నతితోనే సమాజాభివృద్ధి సాధ్యమని కావలి మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ మహిళా విభాగం, జేడీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పార్వతిశంకర్‌, మానినేని అరుణ అధ్యక్షతన రెడ్‌క్రాస్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్మమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం మున్సిపల్‌ మహిళా పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు, టవళ్లు, సబ్బులు, మాస్కులు పంపిణీ చేశారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు మహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ రవిప్రకాష్‌, గంధం ప్రసన్నాంజనేయులు, మహిళా ప్రముఖులు సుమతీలత, ఎం నళిని, షమారహీం, విద్యావతి, తదితరులు పాల్గొన్నారు. ఉమెన్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి పాఠశాలలో ఫోర్స్‌ అధ్యక్షురాలు సీ శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, రెండో పట్టణ ఎస్సై టీ అరుణ పాల్గొన్నారు. ఆటలు, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కరాటేలో గ్రీన్‌ బెల్ట్‌ సాధించిన వింత నవ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయనీమణులు ఉమాశర్మ, లక్ష్మీప్రశాంతి, హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, సంధ్య, మురాజ్‌, అమరజ్యోతి పాల్గొన్నారు. అద్వి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జెడ్పీ బాలికల పాఠశాలలో హెచ్‌ఎం ఝాన్సీలత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిఽథులుగా 2టౌన్‌ ఎస్సై టీ అరుణ, కార్యక్రమంలో ఫౌండేషన్‌ చైర్మన్‌ బెజవాడ ప్రసన్న, సభ్యులు భార్గవ, యోగానంద, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు శ్యామల పర్యవేక్షణలో పాతూరు మున్సిపల్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయినులు, తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్‌ ఆధ్యర్యంలో శ్రీసాయి డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్మమంలో యూటీఎఫ్‌ జిల్లా కౌన్సిలర్‌ సంపత్‌కుమారి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర నాయకురాలు లక్ష్మి, మృధుల, శ్రీదివ్య, రాజరాజేశ్వరి, సాయికుమారి, కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి మాధవ, పెద్దసంఖ్యలో మహిళా ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ ఆధ్వర్యంలో మండల విద్యావనరుల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు మునీర్‌జాన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయినులను సత్కరించారు. సంతో్‌షకుమారి, మంజుభార్గవి, దేవసేన, నాగలక్ష్మి, శ్యామల, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్పీడీవో సుబ్బారావు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రూరల్‌ మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచు చిమ్మిలి శ్రీహరినాయుడు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు చిమ్మిలి వసుమతి, కార్యదర్శి రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథులుగా సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్‌ మధుబాబునాయుడు, బొట్లగుంట శ్రీహరినాయుడు పాల్గొని ముగ్గుల పోటీలు నిర్వహించి  మెదటి 5స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతిగా బంగారు ముక్క పుడకలు, పోటీలో పాల్గొన్న మహిళలందరికీ చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ, అనిల్‌, మహేష్‌, మల్లికార్జున్‌, శ్రీను, చంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే చెంచుగానిపాలెం సర్పంచు జంపాని జాలమ్మను, ఆమె భర్త జంపాని రాఘవులును ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధిక్‌, ఉపాధ్యాయులు మునీర్‌జాన్‌, భాస్కర్‌నారాయణ, సాయిరెడ్డి, శ్రీనివా్‌సబాబు, జిలానీబాషా, అంగన్‌వాడీ కార్యకర్త ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-09T04:32:01+05:30 IST