వనిత.. ఓ వనిత!

ABN , First Publish Date - 2021-03-09T05:40:24+05:30 IST

మహిళా దినోత్సవాన్ని సోమవారం నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయాల్లో వేడుకలు జరిపారు.

వనిత.. ఓ వనిత!
డీపీవో కార్యాలయంలో కేక్‌ కట్‌చేస్తున్న ధనలక్ష్మి

ఘనంగా మహిళా దినోత్సవం

కార్యాలయాల్లో వేడుకలు

అధికారులు, ఉద్యోగినులకు సన్మానం

నెల్లూరు(జడ్పీ/హరనాథపురం), మార్చి 8 : మహిళా దినోత్సవాన్ని సోమవారం నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో ధనలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు కేక్‌ కట్‌చేసి వేడుకలు జరుపుకున్నారు.    విద్యుత్‌ భవన్‌లో మహిళా ఉద్యోగులతో కలిసి ఎస్‌ఈ ఆదిశేషయ్య వేడుకలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందన్నారు. బీవీనగర్‌లోని కేఎన్‌ఆర్‌ హైస్కూల్‌లో జరిగిన వేడుకలకు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు, ఊళ్లు ఆనందంగా ఉంటాయన్నారు. 

ఏపీజీఈఏ ఆధ్వర్యంలో జెట్టి శేషారెడ్డి భవన్‌లో మహిళా దినోత్సవం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి డీ ధనలక్ష్మి,  ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు వై రమణారెడ్డి, కార్యదర్శి మల్లికార్జున, రాంప్రసాద్‌, హెచ్‌డీసీ కోఆర్డినేటర్‌ కాకుటూరు సునంద, ఆర్‌ఎంవో వీ కళారాణి, ఏపీజీఈఏ మహిళా విభాగం చైర్‌పర్సన్‌  టీ సౌందర్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏ విజయ నిర్మల, కన్వీనర్‌ జీఎస్‌ఎల్‌ సౌజన్య, ఉపాధ్యక్షురాలు కే రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


మహిళా పోలీసులకు పురస్కారాలు

నెల్లూరు(క్రైం), మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన మహిళా పోలీసులకు సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డీజీపీ పురస్కారాలు అందించారు. అందులో నెల్లూరు జిల్లా దిశ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కూచిపూడి స్వప్నకు అవార్డు లభించింది. వెంకటాచలం పోలీస్‌ స్టేషన్‌లో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో ఆమె భారీగా నగదు పట్టుకున్నారు. రాపూరులో పనిచేస్తున్న సమయంలో ఏ గ్రేడ్‌ ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. ప్రస్తుతం దిశ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ మహిళల సమస్యల పరిష్కారంలో ముందున్నారు. చిల్లకూరు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సంపూర్ణకు పురస్కారం లభించింది. నాటుసారా విక్రయాలు, తయారీని అరికట్టడంలో ప్రతిభ చూపడంతో ఆమెకు డీజీపీ అవార్డు అందజేశారు.

Updated Date - 2021-03-09T05:40:24+05:30 IST