రాజకీయాల్లోనూ మహిళలు ముందుండాలి

ABN , First Publish Date - 2021-03-09T05:38:39+05:30 IST

మహిళలు అన్ని రంగాలతోపాటు రాజకీయాల్లోనూ చైతన్యవంతులై ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పిలుపునిచ్చారు.

రాజకీయాల్లోనూ మహిళలు ముందుండాలి
ప్రశంసా పత్రాలు అందుకున్న కరోనా వారియర్స్‌తో టీడీపీ నాయకులు

టీడీపీ నేత అజీజ్‌

నెల్లూరు(వ్యవసాయం), మార్చి 8 : మహిళలు అన్ని రంగాలతోపాటు రాజకీయాల్లోనూ చైతన్యవంతులై ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. నెల్లూరు పార్లమెంటు స్థానం తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొమరి విజయ, నగర అధ్యక్షురాలు రేవతి, ప్రధాన కార్యదర్శి రోజారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ మహిళలకు సమాన ఆస్తి హక్కు దక్కడానికి మాజీ సీఎం నందమూరి తారక రామారావు కృషి చేశారని కొనియాడారు. రాజకీయాల్లో మహిళలకు టీడీపీ సమాన ప్రాధాన్యమిస్తోందన్నా రు. ఈ సందర్భంగా 30మంది మహిళా కరోనా వారియర్స్‌ను అజీజ్‌ సన్మానించి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అజీజ్‌, ఎమ్మెల్సీ బీద రవిచంద్రల సతీమణులు షర్మిల, జ్యోతితోపాటు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, నాయకులు కిలారి వెంకటస్వామి నాయుడు, తిరుమల నాయుడు, ప్రణయ్‌ కుమార్‌, సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌, కప్పిర శ్రీనివాసులు, సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:38:39+05:30 IST