ఆడవారి ముక్కులే షార్ప్

Feb 28 2020 @ 16:13PM

మనిషికీ, మనిషికీ వాసన పసిగట్టడంలో కొంత తేడా ఉండవచ్చు. కానీ మగవారికంటే ఆడవారి ముక్కులే మహా చురుగ్గా పనిచేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మగవారితో పోలిస్తే ఆడవారి ముక్కు చురుగ్గా పని చేస్తుందేమో అన్నది మొదటి నుంచీ ఉన్న అనుమానమే! కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా, ఆ వాదనకు రుజువు కనుక్కోలేకపోయారు. బ్రెజిల్‌కి చెందిన శాస్త్రవేత్తలు Isotropic fractionators అనే పరీక్షని రూపొందించారు. ఈ పరీక్షతో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో కచ్చితంగా లెక్కకట్టవచ్చునట!

Isotropic fractionators ఉపయోగించి కొందరిని పరీక్షించారు. వాసనకి సంబంధించిన న్యూరాన్లు ఆడవారిలో 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ పరీక్షలో తేలింది. బహుశా ఆడవాళ్లకి పుట్టుకతోనే వాసనకి సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. మనకి తెలియకుండానే ముక్కు చాలా విషయాల్ని తెలియజేస్తుంటుంది. బయట వర్షం పడుతున్నా, ఎక్కడన్నా మంటలు చెలరేగుతున్నా.. కొన్ని వాసనలు వస్తుంటాయి. వాటిని స్త్రీల ముక్కులు వెంటనే పసిగట్టేస్తాయంటున్నారు పరిశోధకులు.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.